హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు..

పండగ వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కొందరు మెరుపు ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌ను వ్యాప్తి చేశారు.

news18-telugu
Updated: January 16, 2020, 8:18 AM IST
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు..
బహదూర్‌పురాలో ఆర్పీఎఫ్ పోలీసుల మోహరింపు
  • Share this:
పండగ వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కొందరు మెరుపు ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌ను వ్యాప్తి చేశారు. ఈ సందేశం పోలీసులకు చేరడంతో అలర్టైన పోలీసులు రంగంలోకి దిగారు. ‘బహదూర్‌పురా, మసాబ్ ట్యాంక్, నెక్లెస్ రోడ్, ముసారాంబాగ్, కాచిగూడ క్రాస్ రోడ్స్, టోలిచౌకి ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు మెరుపు ధర్నాకు సిద్ధం కావాలని, ఇందులో భారీగా పాల్గొనాలని సందేశం వచ్చింది.

ఈ మెసేజ్ పోలీసులకు చేరడంతో.. ఏదో తప్పు జరిగేలా ఉందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హైదరాబాద్ పోలీసులతో సహా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, టాస్క్ ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ప్లాటూన్స్‌ను దించారు. కొందరు పోలీసులు సివిల్ డ్రెస్‌లో మసీదులు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెట్టారు. అయితే.. ఎలాంటి ధర్నా గానీ జరగలేదు.


First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>