Home /News /crime /

POLICE CONSTABLE WIFE SUSPECTED DEATH IN VIJAYAWADA OF ANDHRA PRADESH BHAVANIPURAM POLICE TOOK UP INVESTIGATION HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద మృతి.. సూసైడ్ నోట్ లో వింత కారణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ (Vijayawda) లో పోలీస్ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దర్యాప్తులో భాగంగా సూసైట్ నోట్ చదివిన పోలీసులకు (AP Police) షాకింగ్ నిజాలు తెలిశాయి.

    భర్త కానిస్టేబుల్.. సీఎం క్యాంప్ ఆఫీస్ లో డ్యూటీ. భార్యభర్తల మధ్య ఎలాంటి వివాదాలు, గొడవలు లేవు. కట్ చేస్తే భార్య అనుమాస్పదస్థితిలో మృతి చెందింది. దర్యాప్తులో భాగంగా సూసైట్ నోట్ చదివిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గరివిడి మండలం యెండపల్లి గ్రామానికి చెందిన మీసాల కృష్ణరావుకు.. శ్రీకాకుళం జిల్లా జి.సింగడం మండండలం పీఆర్ వలస గ్రామానికి చెందిన రజినితో 2015లో వివాహమైంది. వీరికి 15 నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. కృష్ణారావు ప్రస్తుతం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వారు గొల్లపూడిలోని మౌలానగర్లో నివాసముంటున్నారు. ఈనెల 11వ తేదీ రాత్రి రజిని ఇంట్లో ఉండగానే కృష్ణారావు ఇంటికి తాళం వేసుకొని నైట్ ట్యూటీకి వెళ్లాడు.

    శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో డ్యూటీ ముగిసిన తర్వాత రజనీకి ఫోన్ చేయగా టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. టిఫిన్ తీసుకోని 9గంటల సమయంలో ఇంటికి వచ్చిన దుర్గారావు.. తలుపులు తెరిచి చూడగా రజని ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. దీంతో కంగారుపడిన అతడు భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు రజనీ డైరీతో పాటు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తన భర్త మంచివాడని.. రాత్రుళ్ల తనకు పిచ్చిపిచ్చి కలలు వస్తున్నాయని అందులో రాసి ఉంది.

    మృతిపై అనుమానాలు
    రజని మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రజని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కృష్ణారావును విచారిస్తున్నారు. సూసైడ్ నోట్ నిజంగా రజనీనే రాసిందా..? అనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే భార్యభర్తల మధ్య వివాదాలేమైనా ఉన్నాయా..? భార్యను ఇంట్లో ఉంచి బయట తాళం వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కృష్ణారావును ప్రశ్నిస్తున్నారు. ఐతే తాను డ్యూటీకి వెళ్లి ఎప్పుడు వస్తానో తెలియదని.. భార్యను ఇబ్బంది పెట్టడం ఎందుకని బయట తాళం వేసినట్లు కృష్ణారావు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న రజని బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వారిని కూడా విచారించిన తర్వాత అసలు నిజం తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Crime, Crime news, Krishna District, Murder, Suicide, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు