14 ఏళ్ల పనిమనిషిని రేప్ చేసిన పోలీస్ కానిస్టేబుల్

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పోలీస్ కానిస్టేబుల్ తమ ఇంట్లో పనిచేసే అమ్మాయి మీద అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: July 25, 2019, 10:05 PM IST
14 ఏళ్ల పనిమనిషిని రేప్ చేసిన పోలీస్ కానిస్టేబుల్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 25, 2019, 10:05 PM IST
తమ ఇంట్లో పనిచేస్తున్న ఓ మైనర్ బాలిక మీద పోలీస్ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ శివారులోని ముకుంద్ ఏరియాలో ఉండే ఓ కానిస్టేబుల్ తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. మంగళవారం ఉదయం కానిస్టేబుల్ ఇంట్లో వారు బయటకువెళ్లినప్పుడు ఆ బాలిక ఒంటరిగా ఉంది. దీంతో ఆమె మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గతంలో కూడా బాలిక మీద లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్ కానిస్టేబుల్ పరారయ్యాడు. నిందితుడి పేరు, ఇతర వివరాలు తెలియలేదు. అయితే, ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తాడని తెలిసింది. పోలీస్ కానిస్టేబుల్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

First published: July 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...