Home /News /crime /

POLICE CONSTABLE COMMITS SUICIDE IN KHAMMAM HIS FAMILY ALLEGES TRANSFER ISSUE OTHER SIDE TEACHERS ALSO MKS

బదిలీ బాధతో మొన్న టీచరమ్మ.. బదిలీ కాలేదని నిన్న కానిస్టేబుల్.. నిశ్చితార్థం రోజే హోటల్ గదిలో..

వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్య చేసుకున్న పోలీస్, టీచర్

వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్య చేసుకున్న పోలీస్, టీచర్

నిజామాబాద్ జిల్లాలో టీచర్ బలవన్మరణానికి పాల్పడిందనే వాదన ఉండగా, ఖమ్మం జిల్లాలో మాత్రం బదిలీ కాలేదనే కారణంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాన్స్ ఫర్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు వరుసగా ఇలా విపరీత నిర్ణయాలు తీసుకుంటుండటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివరాలివి..

ఇంకా చదవండి ...
నిజామాబాద్ జిల్లాలో యువ టీచర్ సరస్వతి ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకు ముందు వరంగల్ జిల్లాలో ఓ సీనియర్ టీచర్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణలో కొత్త జోనల్ విధానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన జీవో 317 వల్లే ఇలాంటి జరుగుతున్నాయని విపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. జీవో 317కి వ్యతిరేకంగా దీక్ష చేయబోయి బండి సంజయ్ అరెస్టు కావడం, బీజేపీ ఇటీవల హన్మకొండలో భారీ నిరసన సభ నిర్వహించడం తెలిసిందే. బదిలీ అయిన కారణంగానే నిజామాబాద్ జిల్లాలో టీచర్ బలవన్మరణానికి పాల్పడిందనే వాదన ఉండగా, ఖమ్మం జిల్లాలో మాత్రం బదిలీ కాలేదనే కారణంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాన్స్ ఫర్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు వరుసగా ఇలా విపరీత నిర్ణయాలు తీసుకుంటుండటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివరాలివి..

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలను నిర్దేశించిన జీవో 317 చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. గతవారం నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన గవర్నమెంట్ టీచర్ బేతల సరస్వతి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీంగల్ మండలం రహత్ నగర్‌లో టీచర్‌గా పని చేస్తున్న సరస్వతికి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోలో నిబంధనల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బదిలీ అయింది. దూరప్రాంతానికి బదిలీ అయిందనే మనస్తాపంతోనే ఆమె చనిపోయినట్లు కుటుంబీకులు, ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటన మర్చిపోకముందే, సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సరిగ్గా వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరగాల్సిన రోజే హోటల్ గదిలో అతను ఆత్మహత్య చేసుకోడానికి బదిలీ వివాదమేనని కుటుంబీకులు చెప్పారు. వివరాలివి..

Hyderabad: కరోనా విలయంలో భారీగా వ్యాక్సిన్ల చోరీ.. దొంగలకూ whatsapp గ్రూపులునచ్చిన అమ్మాయితో నిశ్చాతార్థం పెట్టుకున్న రోజునే ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ విగతజీవిగా మారాడు. ఖమ్మంలోని ఓ హోటల్‌ గదిలో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఉద్యోగ బదిలీ విషయంలో కలత చెంది అఘాయిత్యానికి పాల్పడ్డాడని మృతుని తండ్రి ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండ లం యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన కంచెపోగు అశోక్‌ కుమార్‌(27) 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్‌ కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం ములుగు జిల్లాలోని స్పెషల్‌ పార్టీలో అటాచ్‌మెంట్‌గా పని చేస్తున్నాడు. తన సొంత మండలం కల్లూరుకు చెందిన ఓ యువతితో అశోక్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లికూతురి ఇంటి వద్ద సోమవారం నిశ్చితార్థం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 5న తల్లిదండ్రులతో కలిసి ఖమ్మం వచ్చిన అశోక్‌.. నిశ్చితార్థానికి అవసరమైన వస్తువులు కూడా కొనుగోలు చేశాడు. అనంతరం సెలవు పెట్టివస్తానని చెప్పి ములుగు జిల్లాకు వెళ్లాడు..

Wife swap: భార్యలను మార్చుకుంటూ బరితెగింపు సెక్స్ -1000 జంటల వికృత రాసలీల


తిరిగి 8వ తేదీ రాత్రి ఖమ్మం వచ్చిన అశోక్‌.. ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే, అశోక్‌ గది నుంచి బయటకు రాకపోవడం, తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో లాడ్జి సిబ్బంది సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అశోక్‌ ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సెల్‌ఫోన్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని, ఆత్మహత్యకు కారణాన్ని కనిపెడతామని ఏసీపీ ఆంజనేయులు, సీఐ సర్వయ్య తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన Sonu Sood సోదరి మాల్విక -మొగ నుంచి పోటీ -Punjabలో గేమ్ ఛేంజర్!బదిలీ కాలేదనే ఆవేదనతో తన కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అశోక్‌కుమార్‌ తండ్రి వెంకటేశ్వర్లు అనుమానం వ్యక్తం చేశారు. ’అశోక్‌కు కొత్తగూడెం బదిలీ అయింది. కానీ ములుగులోనే ఉండాలని అధికారులు ఆదేశించా రు. దాంతో కలత చెందాడు. నిశ్చితార్థం అనుకున్న రోజున ఇలా జరుగుతుందని అనుకోలేదు. సెలవు పెట్టి తిరిగి ఖమ్మం వచ్చిన తర్వాత అశోక్‌ మళ్లీ మాతో మాట్లాడలేదు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి‘ అని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Khammam, Police, Suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు