Chain snatching: మహిళ మెడ నుంచి ఒక ఆగంతకుడు చైన్ లాక్కొని పారిపోతున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆ దుండగుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. అప్పుడు పోలీసులకు ఊహించని షాక్ ఎదురైంది.
Chain snatching in west godavari: పశ్చిమ గోదావరిజిల్లాలో పట్టపగలే చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న మహిళను వెంబడించాడు.ఆ తర్వాత.. రోడ్డుపై ఎవరులేరని నిర్దారించుకోని ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. మెడలోని చైన్ ను లాక్కొవటానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వారు గుమిగూడారు. అతడిని పట్టకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్ తీసుకొని వెళ్లి విచారించగా అతనుకూడా పోలీసే అని తెలింది.
ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో.. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణ, మరో యువకుడు బుద్ధా సుభాష్ తో కలిసి చైన్ స్నాచింగ్ దందా మొదలు పెట్టాడు. వీరిద్దరు కలిసి ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుంటు కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. మహిళలపై పెప్పర్ స్ప్రే చల్లి వారి దగ్గర ఉన్న బంగారం , సొత్తు తీసుకొని పారిపోయే వారు. అప్పులు పెరిగి పోవడం, వస్తున్న జీతం సరిపోకపోవడంతో దోంగతనాలు చేస్తున్నానని కానిస్టేబుల్ అంగీకరించాడు. వీరిద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరి నుంచి చైన్, పెప్పర్ స్ప్రే బాటిల్, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ ఘటన వెలుగు చూసింది.
ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 24, రోహిణి సెక్టార్ 24లో సినిమా స్టైల్లో దాదాపు 2 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు అగంతకులు. ఈ ఘటన అంతా వెలుతురులో జరగడంతోపాటు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయింది. మంగళవారం రాత్రి బైక్పై వచ్చిన దుండగులు రోహిణి సెక్టార్ 22 నివాసి నరేంద్ర కుమార్ అగర్వాల్ కారుపై దాడి చేసి ఉచ్చు బిగించి రూ.2 కోట్లు దోచుకుని పరారయ్యారు.
రోహిణి సెక్టార్ 22 నివాసి నరేంద్ర కుమార్ అగర్వాల్ సెక్టార్ 24లో నివసిస్తున్న తన మేనల్లుడు కరణ్ అగర్వాల్ ఇంటికి కారులో వెళ్తున్నాడు. అతని డ్రైవర్ ధర్మేంద్ర కారు నడుపుతున్నాడు. కారు సెక్టార్ 24కి చేరుకోగానే స్కూటీపై ఉన్న ఓ వ్యక్తి తన కారును ఆపాడు. ఆ తర్వాత మరికొందరు అగంతకులు వెనుక నుంచి వచ్చి డ్రైవర్ పక్క కిటికీ అద్దాలు పగులగొట్టి, కారు తాళం లాక్కొని ట్రంక్ తెరిచారు. అనంతరం ట్రంకు పెట్టెలో ఉంచిన 3 బస్తాల నిండా డబ్బుతో ఈ దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ దుండగులంతా హెల్మెట్ ధరించి ఉండడం వల్ల వారిని ఇంకా గుర్తించలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.