హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : మరో షాకింగ్ ఘటన : బాలికపై పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం -చితకబాదిన జనం

Hyderabad : మరో షాకింగ్ ఘటన : బాలికపై పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం -చితకబాదిన జనం

నిందితుడైన కానిస్టేబుల్ శేఖర్

నిందితుడైన కానిస్టేబుల్ శేఖర్

బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ శేఖర్ ను స్థానికులు చితకబాదిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతణ్ని చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం నాటికి ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. కానిస్టేబుల్ శేఖర్ పై అత్యాచారయత్నం కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి ...

అప్పుడే పుట్టిన పసిపాప నుంచి పండు ముసలి దాకా వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై మృగాళ్లు అకృత్యాలకు పాల్పడుతుండగా.. ఆ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ఖాకీలే ఆడపిల్లల పాలిట కీచకులైతే? గత వారం హర్యానాలో స్పా సెంటర్ లో పనిచేస్తోన్న ఇద్దరు యువతులపై పోలీస్ సీఐ, హోగార్డు, మరో స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడటం, సదరు ఘటనపై పోలీస్ కేసు కూడా నమోదుకావడం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కానిస్టేబుల్.. మైనర్ బాలికను చెరపట్టేందుకు ప్రయత్నించాడు. వివరాలివి..

హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలో అనూహ్య ఘటన జరిగింది. రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న వడ్డే శేఖర్.. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే శంకర్ పల్లి మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ శేఖర్.. అదే ఊరికి చెందిన బాలికపై అత్యాచారయత్నం చేయగా.. ఆమె భయంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు పరుగున వచ్చారు..

పోలీసులే గ్యాంగ్ రేప్ చేశారు -ఇద్దరమ్మాయిలతో మసాజ్ కావాలంటూ -అటు ఇటు మార్చుకుంటూ దారుణంగా..బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ శేఖర్ ను స్థానికులు చితకబాదిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతణ్ని చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం నాటికి ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. కానిస్టేబుల్ శేఖర్ పై అత్యాచారయత్నం కేసు నమోదు చేశారు.

బీజేపీకి అధికారం అప్పగించేస్తాం.. ఆ సినిమా చూసిన ఆవేశంలో మంత్రి సంచలన వ్యాఖ్యలునిందితుడు వడ్డే శేఖర్ హైదరాబాద్ సిటీ పరిధిలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బాలికపై రేప్ అటెంప్ట్ కేసులో నిందితుడిగా తేలడంతో అతనిపై శాఖపరమైన చర్యలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. పోలీస్ అయి ఉండీ, చట్టం తెలిసుండీ ఇంతటి నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Haryana police, Hyderabad, Minor girl, Rape attempt

ఉత్తమ కథలు