హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Crime News: ముంబైలో 55ఏళ్ల తల్లి మృతదేహం వాసన రాకుండా 200రకాల పర్‌ఫ్యూమ్స్‌ వాడిన కూతురు..చంపిందెవరంటే

Crime News: ముంబైలో 55ఏళ్ల తల్లి మృతదేహం వాసన రాకుండా 200రకాల పర్‌ఫ్యూమ్స్‌ వాడిన కూతురు..చంపిందెవరంటే

mumbai murder(Photo:Instagram)

mumbai murder(Photo:Instagram)

Mumbai:ముంబైలో 55ఏళ్ల మహిళ మృతిని హత్యగా తేల్చారు పోలీసులు. ఈకేసులో నిందితురాలు మృతురాలి కూతురు రింపుల్ ప్రకాష్ జైన్‌గా భావిస్తున్నారు. తల్లి శవాన్ని ముక్కలు చేసిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకు 200రకాల పర్‌ఫ్యూమ్స్, ఎయిర్‌ఫ్రెషర్‌ స్ప్రేలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

మహరాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లో ఓ మహిళ హత్యకు గురైన కేసులో మిస్టరీ వీడటం లేదు. 55సంవత్సరాల వీణా జైన్(Veena Jain)అనే మహిళ శరీర శరీర భాగాల్ని ముక్కులుగా వేరు చేసి ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఇంట్లో పెట్టుకుంది ఆమె కూతురు రింపుల్ ప్రకాష్ జైన్(Rimple Prakash Jain). ఈవార్త చాలా రోజుల క్రితం జరిగినప్పటికి ఆలస్యంగా వెలగులోకి వచ్చింది..లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్‌ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు తల్లీకూతురు. రెండు నెలలుగా వీణా జైన్ కనిపించడం లేదని ఆమె బంధువు పోలీస్ కంప్లైంట్ (Police Complaint)ఇవ్వడంతో పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని కూతురు ఫ్లాట్‌కు వచ్చి తలుపు కొట్టారు. లోపల శవాన్ని ప్లాస్టిక్ కవర్‌(Plastic cover)లో చుట్టి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. తల, మొండెం బీరువాలో ఉండగా..కాళ్లు, చేతులు స్టీల్ వాటర్ క్యాన్‌లో కనిపించాయి. మంగళవారం పోలీసులు మృతురాలు వీణాజైన్ శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దుర్వాసన రావడంతో పాటు చెల్లాచెదురుగా వస్తువులు పడి ఉండటంతో కూతురు రింపుల్‌ ప్రకాష్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తల్లి శవం దగ్గర కూతురు..

22సంవత్సరాల యువతి రింపుల్ ప్రకాష్ జైనే తల్లి వీణా జైన్‌ని హత్య చేసి ఉంటుందన్న అనుమానంతో విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి శరీర భాగాల్ని పోస్ట్‌ మార్టంకు తరలించారు. మంగళవారం డెడ్‌బాడీని రికవరీ చేసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ వాసుల్ని ఆరా తీశారు. చనిపోయిన మహిళ , ఆమె కూతురు గురించి వివరాలు సేకరించారు. మృతురాలి కూతురు రింపుల్ ప్రకాష్ జైన్‌ను ప్రశ్నించిన పోలీసులకు యువతి పొంతన లేని సమాధానం చెప్పింది. తన తల్లి రెండు నెలల క్రితం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిండపడితే ఇద్దరు పైకి తీసుకొచ్చి వెళ్లిపోయారని చెప్పింది. భయంతోనే ఎవరికి చెప్పలేదని సమర్దించుకుంది.

(తల్లిని చంపిన కూతురు)

బిడ్డే హత్య చేసిందని డౌట్..

అపార్ట్మెంట్ వాసులు గత రెండు నెలలుగా మృతురాలు వీణాజైన్‌ను తాము చూడలేదని ఆమె సోదరుడికి చెప్పడంతో కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని సుమారు రెండు నెలల తర్వాత స్వాదీనం చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. ఎలా చనిపోయింది..కూతురు ఏమైనా హత్య చేసిందా అనే కోణంలో ఆరా తీసారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Viral Video: ఒక్క మామిడి చెట్టుకు 300రకాల మామిడి పండ్లు ..అద్భుతమైన చెట్టు వీడియో ఇదిగో

శవాన్ని భద్రపరిచేందుకు పర్‌ఫ్యూమ్స్, స్ప్రేలు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న వీణాజైన్ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటమే కాకుండా వాసన రాకపోవడంతో ఆదిశగా ఆరా తీశారు. అయితే మృతురాలి కుమార్తె తల్లి శరీర భాగాలు వాసన రాకుండా ఉండేదుకు సుమారు 200రకాల పర్‌ఫ్యూమ్స్, ఎయిర్‌ఫ్రెషనర్‌ స్ప్రేలు తెప్పించి వాటిపై పూసిందని తేలింది. తల్లి శరీర భాగాలు పెట్టిన గదిలోనే రింపుల్ ప్రకాష్ జైన్ కూర్చొని ఉండటం, పోలీసులకు అబద్దం చెప్పడం వంటి అంశాల్ని పోలీసులు సునిశితంగా గమనిస్తున్నారు. అయితే వీణాజైన్‌ను డిసెంబర్‌లో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

కటకటాల వెనక్కి కూతురు..

నిందితురాలిగా అనుమానిస్తున్న రింపుల్‌ ప్రకాష్ జైన్ తల్లికిందపడిందని చెబుతూనే అందరికి చెప్పడానికి భయమైందనడంపై పోలీసులు సందేహాలు నెలకొన్నాయి. అయితే కూతురే చంపి ఉంటుందనే విషయాన్ని దాదాపు దృవీకరించిన పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అసలు కన్నతల్లిని ఇంత కర్కశంగా చంపడానికి కారణం ఏమై ఉండవచ్చని కూడా సమాచారం రాబడుతున్నారు. మృతురాలి కుమార్తె 23ఏళ్ల రింపుల్‌పై ఐపీసీ సెక్షన్ 302,ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది..? ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

First published:

Tags: Mumbai crime, Old women killed

ఉత్తమ కథలు