Home /News /crime /

POLICE CONDUCTING A SERIES OF RAIDS ON CRICKET BETTING CANNABIS AND GAMBLING IN MANCHERIAL DISTRICT AND ISSUING WARNINGS ADB PRV

Mancherial: బెట్టింగ్​, జూదంలపై పోలీసుల ఉక్కుపాదం.. ఆ జిల్లాలో వరుస దాడులతో భరతం పడుతున్న ఖాకీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోళ్ల పందాలు, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, గుట్కా, మట్కా, జూదం వంటి వాటిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మంచిర్యాల జిల్లాలో వరుసు దాడులతో పేకటరాయుళ్ళల్లో గుబులు పుట్టిస్తున్నారు.

    కోళ్ల పందాలు, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, గుట్కా, మట్కా, జూదం వంటి వాటిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మంచిర్యాల జిల్లాలో వరుసు దాడులతో పేకటరాయుళ్ళల్లో గుబులు పుట్టిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో పేకాట నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు జరుపుతున్నారు. తాజాగా మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలని లో చీర్ల రాజేశ్వర్ రెడ్డి  తన ఇంటి ఆవరణలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట (Cards) ఆడుతున్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ లు ఏకే మహేందర్, రాజ్ కుమార్  టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలసి ఆ పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు పేకాటరాయుళ్ళను, పేకాట నిర్వహిస్తున్న ఇంటి యజమానిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పేక ముక్కలు,  25 వేల 100 రూపాయల నగదును, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నలుగురు మంచిర్యాల పట్టణానికి చెందినవారు కాగా మరొకరు వేమనపల్లి మండలానికి చెందినవారు. తదుపరి విచారణ కోసం జూదరులను మంచిర్యాల పోలీసులకు (Police) అప్పగించారు.

    పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి..

    ఇదిలా ఉంటే ఈ దాడికి ముందు  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్.పి రోడ్ లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై  టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి (Raids) నిర్వహించారు.  ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పేకముక్కలు, 73 వేల డెబ్బై రూపాయల నగదును, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

    గంజాయి సేవిస్తున్న ప్రాంతాలలో..

    అంతకుముందు కూడా పలుచోట్ల ఇలా దాడులు(Raids) జరిపి పేకటరాయుళ్ల భరతం పట్టారు. మరోవైపు గంజాయి (Marijuana) నివారణ చర్యల్లో భాగంగా మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొర్రిగూడ, బాదంపల్లి, దేవుని గూడా, కిష్టాపూర్ గ్రామాలతోపాటు ధర్నారం రోడ్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task force) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతాలలోని కొంతమంది యువత తరుచూ గంజాయి సేవిస్తూ, పెడదారి పడుతున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారు రహస్యంగా గంజాయి సేవిస్తున్న ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహస్యంగా ఏర్పాటు చేసుకున్న స్థావరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసి అక్కడ వారు ఉపయోగిస్తున్న సీసాలు, వస్తువులు, గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

    ఇప్పటికే వరుస దాడులతో ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా వరకు గంజాయి (Marijuana)ని నివారించామని,  కానీ ఇంకా కొంత మంది అక్కడక్కడ రహస్యంగా గంజాయి సేవిస్తున్నారని, అలాంటి వారి వివరాలు సేకరిస్తున్నామని వారిని కూడా పట్టుకుని చట్టరీత్య చర్య లు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gambling, Mancherial, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు