హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: బెడ్రూంలో ఆ రకమైన టార్చర్ పెడుతున్న భర్త .. భరించలేని భార్య ఏం చేసిందో చూడండి

OMG: బెడ్రూంలో ఆ రకమైన టార్చర్ పెడుతున్న భర్త .. భరించలేని భార్య ఏం చేసిందో చూడండి

Husband Harassment

Husband Harassment

OMG:భార్యను బెడ్రూంలోకి తీసుకెళ్లి టార్చర్ పెడుతూ ఆనంద పడుతున్న భర్తకు బుద్ధి చెప్పింది భార్య. కాపురం పేరుతో కామాంధుడిగా మారిన మొగుడు శాడిజాన్ని బయటపెట్టింది. అసలు ఆ భర్త చేస్తున్న వెదవ పని ఏంటో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లో ఓ మహిళ భర్తను పోలీసులకు పట్టించింది. మొగుడి స్థానంలో ఉన్న వ్యక్తి మహిళ ఇష్టా,ఇష్టాలను గౌరవించకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ..కాపురం పేరుతో కామవాంఛ తీర్చుకోవడం కోసం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ తనపై పలుమార్లు బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికి సిగ్గుతో ఇంతకాలం భరిస్తూ వచ్చినా మహిళ..చివరకు భర్తను పోలీస్ స్టేషన్‌(Police station) మెట్లెక్కించింది. హాపూర్‌(Hapur)లోని గర్‌ ముక్తేశ్వర్‌ కొత్వాలి( Gar Mukteshwar Kotwali)ప్రాంతంలో ఈసంఘటన జరిగింది.

Dangerous accident : హైవేపై కంటైనర్ బీభత్సం.. తుక్కు తుక్కైన 48కార్లు,ఎంత మంది గాయపడ్డారంటే

భార్యతో బెడ్రూంలో వెకిలి వేషాలు..

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని గర్‌ ముక్తేశ్వర్‌ కొత్వాలి ప్రాంతంలో ఓ వివాహిత లైంగిక వేధింపులు భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేసింది ఎవరిపైనో కాదు కట్టుకున్న భర్తపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆడవాళ్ల ఇష్ట, ఇష్టాల్ని గౌరవించాలని న్యాయస్థానాలు చెబుతున్నా కొందరు మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన భర్త ...బలవంతంగా బెడ్రూంలోకి తీసుకెళ్లడం..అక్కడ అసభ్యకరమైన అశ్లీల వీడియోలను సెల్‌ఫోన్‌లో చూపిస్తూ ఆవిధంగా తనతో గడపమని వేధిస్తూ ఉన్నాడు. భర్త చెప్పిన విధంగా చేయకపోయినా, బెడ్రూంలో ప్రతిఘటించినా కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడంతో విసిగిపోయింది ఆ ఇల్లాలు.

కామోన్మాది..

తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్న గృహిణి మహిళా పోలీసులను ఆశ్రయించింది. భర్త ఆకృత్యాలను, అతను పెట్టే టార్చర్‌కి సంబంధించిన వీడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకున్న కొత్వాలి పోలీసులు బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శాడిస్ట్ భర్తకు గుణపాఠం..

గుట్టుగా అన్యోన్యంగా కాపురం చేయాల్సిన భర్త కేవలం తన కామవాంఛ తీర్చుకోవడం కోసం శాడిస్ట్‌లా ప్రవర్తించినట్లుగా పోలీసులు తేల్చారు. కట్టుకున్న భార్యపై అనేక సార్లు బలవంతంగా అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తేల్చారు. బాధితురాలిని కొట్టినట్లుగా, చెప్పుకోలేని చోట గాయపరిచినట్లుగా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశారు. భర్త మానసీక పరిస్థితిని గమనించి విచారిస్తున్నారు.

First published:

Tags: Crime news, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు