హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : ఈ నగరానికి ఏమైంది.. లాడ్జిలా? డెన్ లా?.. వారం రోజుల్లో ఆడపిల్లలపై ఇన్ని దారుణాలా?

Hyderabad : ఈ నగరానికి ఏమైంది.. లాడ్జిలా? డెన్ లా?.. వారం రోజుల్లో ఆడపిల్లలపై ఇన్ని దారుణాలా?

HYDERABAD POLICE(FILE)

HYDERABAD POLICE(FILE)

Hyderabad: హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేట్ లాడ్జీలు మైనర్లను లైంగికంగా వేధింపులకు గురిచేసే డెన్‌లుగా మారాయి. వరుస సంఘటనలు తెరపైకి రావడంతో పోలీసులు లాడ్జీల ముసుగులో జరుగుతున్న దుకాణాలను బంద్ చేయడానికి రెడీ అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

హైద‌రాబాద్‌(Hyderabad)లోని చాలా లాడ్జీ(Lodges)లు శారీరక వేధింపు(Physical abuse)ల‌కు అడ్డాలుగా మారిపోతున్నాయి. గ‌డిచిన వారం రోజుల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లే ఇందుకు ఉదాహార‌ణ‌గా నిలుస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ లాడ్జీలు మైనర్లను లైంగికంగా వేధింపులకు గురిచేసే డెన్‌లుగా మారాయి. పాతబస్తీకి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్(Kidnapping)చేసి నెల రోజుల వ్యవధిలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు కామోన్మాదులు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులు ప్రైవేట్ లాడ్జీలను ఉపయోగించి నేరాలకు పాల్పడ్డట్లుగా తేలింది. ఈ ఘటనల తర్వాత నగరంలోని ప్రైవేట్ లాడ్జీల్లో మహిళల భద్రతకు సంబంధించి ముఖ్యంగా యువతులు, మైనర్ బాలికల భద్రత అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

SAD NEWS: సాఫ్ట్‌పేర్ జాబ్‌లో చేరాల్సిన కొడుకు ఇంటికొచ్చాడు .. తిరిగి వెళ్లలేదు.. ఏం జరిగిందంటే ..!

లాడ్జీలపై నిఘా ..

తాజాగా మ‌రో ఘటన దబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఓ లాడ్జిలో 14 ఏళ్ల బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల పాటు బాలికను అక్కడే ఉంచారు. మ‌రో సంఘ‌ట‌న‌లో  ఆగస్ట్‌లో హఫీజ్ బాబానగర్‌కు చెందిన 9వ తరగతి బాలికపై షహలీబండలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో అత్యాచారం జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీసులు ఆగస్టు 12న కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. జ‌రిగిన సంఘ‌ట‌న‌పై  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యాచారానికి ముందు మైన‌ర్ బాలిక‌కు సూదుల ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం జనరల్ స్టోర్‌కు వెళ్లిన‌ బాలిక‌ను క‌డ్నాప్ చేసి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు బాధితురాలు తల్లి, అమ్మమ్మ పోలీసుల‌కు పిర్యాధు చేశారు.

మైనర్‌లపై లైంగిక వేధింపులు..

ఇదిలా ఉంటే చాంద్రాయణగుట్ట ఘటన కేసులో 21 ఏళ్ల నిందితుడు హోటల్ రిసెప్షన్‌లో వేరొక‌రి ఆధార్ కార్డుతో రూమ్ తీసుకున్న‌ట్లు ఇన్వెస్టిగేష‌న్‌లో తేలింది. గతంలో బాలికలను, మహిళలను నిర్జన ప్రాంతాలు లేదా నగర శివార్లలో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డేవారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ లాడ్జీలను ఈ కామాంధులు అడ్డాలుగా చేసుకున్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ఉన్న చాలా ప్రైవేట్ లాడ్జీలకు సరైన నిబంధనలు లేవని, మైనర్ బాలికలను అబ్బాయిలకు రూమ్ రెంట్‌కు ఇస్తున్నట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు.

Sad news : కూల్‌ డ్రింక్ బాటిల్ నోట్లో పెట్టుకున్నందుకు ఐదేళ్ల చిన్నారికి ఎంత శిక్ష పడిందో తెలుసా..?

కిడ్నాప్‌ ఆ తర్వాత ..

ఇది చట్ట విరుద్దం కాబట్టి అలాంటి లాడ్జీలపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్లు వినిపిస్తోన్నాయి. జంటనగరాల పరిధిలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోవడంతో పోలీసులు ప్రైవేట్ లాడ్జీలలో కట్టుదిట్టమైన తనిఖీలు చేయడానికి రెడీ అవుతున్నారు.వారం రోజుల్లోనే నాలుగు సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో ఈ అంశాన్ని సిరియ‌స్ గా తీసుకున్నారు సిటీ పోలీసులు. ఇప్ప‌టికే బృందాలుగా ఏర్ప‌డి సోమవారం నుంచి న‌గ‌రంలోని లాడ్జీలు, ఓయో రూమ్స్‌లో దాడులు నిర్వ‌హిస్తున్నారు. నింబంద‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌ల‌కు సిద్ద‌మవుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad crime, Hyderabad police

ఉత్తమ కథలు