హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kidnap Mystery: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్ చాట్ పరిచయం.. లాంగ్ డ్రైవ్ డ్రామా.. పట్టించిన సీసీ ఫుటేజ్..

Kidnap Mystery: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్ చాట్ పరిచయం.. లాంగ్ డ్రైవ్ డ్రామా.. పట్టించిన సీసీ ఫుటేజ్..

తూర్పుగోదావరిలో యువతి కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ

తూర్పుగోదావరిలో యువతి కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజానగరంకు చెందిన యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరిన ఆమె.. కాలేజీకి వెళ్లకుండానే బస్సు దిగేసింది. అదేరోజు సాయంత్రం మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామని.. ఐదు లక్షలు ఇస్తే విడిచిపెడతామంటూ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది.

ఇంకా చదవండి ...

  ఈ రోజుల్లో సోషల్ మీడియా (Social Media) పరిచయాలు యువతీ యువకులను ఎక్కడివరకు తీసుకెళ్తున్నాయో చెప్పడం కష్టం. కొందర్ని ప్రేమలో పడేస్తే.. మరికొందరికి చేదు అనుభవాలను మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా యువతులు మోసగాళ్ల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలా ఓ యువతికి సోషల్ మీడియాలో పరిచయమైన మోసగాడు లాంగ్ డ్రైవ్ పేరుచెప్పి ఏకంగా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. సకాలంలో స్పందించిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి యువతిని రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజానగరంకు చెందిన యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరిన ఆమె.. కాలేజీకి వెళ్లకుండానే బస్సు దిగేసింది. అదేరోజు సాయంత్రం మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామని.. ఐదు లక్షలు ఇస్తే విడిచిపెడతామంటూ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. యువతిని తాళ్లతో కట్టేసిన వీడియో కూడా దుండగుడు తల్లిదండ్రులకు పంపాడు.

  వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేశారు. అలాగే చివరిసారి ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ నెంబర్ ను కూడా గుర్తించారు. అలాగే యువతి బస్సు దిగిన స్పాట్ లో సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా.. ఆమె ఒక యువకుడితో కలిసి బైక్ పై వెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇద్దరూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకొని యువతిని రక్షించారు.

  ఇది చదవండి: అతడికి 21, ఆమెకు 35.. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు.. కొద్దిసేపటికి ఊహించని ఘటన..


  ఐతే కిడ్నాప్ విషయమై అమ్మాయిని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. కిడ్నాపర్ తో యువతికి శ్నాప్ చాట్ లో పరిచయం ఏర్పడిందని.. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుండేవారని తెలిసింది. కిడ్నాప్ జరిగిన రోజు యువతికి కాల్ చేసిన నిందితుడు లాంగ్ డ్రైవ్ కు వెళ్దామని చెప్పగా ఆమె అతడి బైక్ ఎక్కింది. యువతిని భీమవరం తీసుకెళ్లి లాడ్జిలో బంధించిన యువకుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. యువతి ఇష్టపూర్వకంగానే అతడి బైక్ ఎక్కడంతో ఇది నిజంగా కిడ్నాపేనా.. లేక ఇద్దరూ కలిసి డ్రామా అడారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తమ కుమార్తె క్షేమంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

  ఇది చదవండి: స్టూడెంట్ తో లెక్చరర్ ప్రేమాయణం.. ఫిజిక్స్ క్లాస్ లో కెమిస్ట్రీ పాఠాలు.. కట్ చేస్తే..


  ఇటీవల ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ లో అప్పులపాలైన ఓ ఇంటర్ విద్యార్థి.. తనంతట తానే హైదరాబాద్ వెళ్లిపోయి.. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని.. రూ.5లక్షల ఇవ్వాలని తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ డ్రామాను రట్టుచెసి విద్యార్థిని ఇంటికి తీసుకొచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Kidnap

  ఉత్తమ కథలు