ఆ ధైర్యంతోనే ఏటీఎం మనీ వ్యాన్‌ను మాయం చేసిన సిబ్బంది..

పలు ఏటీఎం మిషన్‌లలో డబ్బులు పెట్టేందుకు వెళ్తూ కనపించకుండా పోయిన ఏటీఎం మనీ వ్యాన్‌ కేసును పోలీసులు చేధించారు. మొత్తంగా 1,68,21,900 రూపాయలు చోరి జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

news18-telugu
Updated: September 14, 2020, 12:02 PM IST
ఆ ధైర్యంతోనే ఏటీఎం మనీ వ్యాన్‌ను మాయం చేసిన సిబ్బంది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పలు ఏటీఎం మిషన్‌లలో డబ్బులు పెట్టేందుకు వెళ్తూ కనపించకుండా పోయిన ఏటీఎం మనీ వ్యాన్‌ కేసును పోలీసులు చేధించారు. మొత్తంగా 1,68,21,900 రూపాయలు చోరి జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్ సీదీ జిల్లాలోని 12 ఏటీఎంలలో మనీ పెట్టే బాధ్యతలను సీఎంఎస్ కంపెనీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. అయితే గత వారం బ్యాంక్ నుంచి తీసుకున్న డబ్బులను.. ఏటీఎంలలో డిపాజిట్ చేసేందుకు బయలుదేరిన వ్యాన్ అదృశ్యమైంది. అయితే ఏటీఎంలలో డబ్బులు లోడ్ కాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్, సీఎంఎస్ కంపెనీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సీఎంఎస్ కంపెనీ సిబ్బందిని సింగ్రౌలి నుంచి అదుపులోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేశారు. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఏటీఎంలలో డబ్బలు పెట్టే సమయంలో వాళ్లు.. 10 లక్షలకు బదులుగా 8 లక్షల రూపాయలు ఉంచేవారు. మిగిలిన 2 లక్షల రూపాయలను చోరీ చేసేవారు. అయితే ఇలా జరుగుతున్న మోసాన్ని బ్యాంక్ గానీ, సీఎంఎస్ కంపెనీ గానీ గుర్తించకపోవడం వారిలో ధైర్యాన్ని పెంచింది.. ఇది మరింత అత్యాశ కలిగేలా చేసింది. దీంతో వారు లక్షల నుంచి కోట్లు కాజేయాలని భావించారు.

ఇక, నిందితుల వద్ద నుంచి పోలీసులు కొంత నగదు, కారు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని సీధీ జిల్లా ఏఎస్‌పీ అంజులత తెలిపారు. నిందితులు కోట్ల రూపాయలు చోరీ చేశారని అన్నారు. కానీ పోలీసులకు వారి వద్ద నుంచి నగదుతో కలిసి రూ. 23 లక్షలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. వారిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్టు చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: September 14, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading