వరుస ఏటీఎంల దొంగను పట్టిచ్చిన చేతి ఆరో వేలు..

ప్రైవేటు ఏటీఎం వద్దకు రాగా అప్పటికే అక్కడ ఉన్న శేఖర్ రెడ్డి నమ్మించి రూ.2వేలు డ్రా చేసి ఇచ్చాడు. ఆ రైతు యాదయ్యకు చెందిన ఏటీఎం కార్డు మార్చి.. కొత్త కార్డు ఇచ్చి పంపాడు.

news18-telugu
Updated: July 11, 2020, 7:58 AM IST
వరుస ఏటీఎంల దొంగను పట్టిచ్చిన చేతి ఆరో వేలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. కానీ తన జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో దొంగ అవతారం ఎత్తాడు. ప్రత్యేకించి ఏటీఎంలకు వచ్చే అమాయకులపైనే అతడి దృష్టి అంతా. ఎంతో చాకచక్యంగా ఏటీఎం కార్డులను మారుస్తూ డబ్బులు దండుకునేవాడు. కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నా.. పోలీసులకు చిక్కకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ఎంత తెలివైన దొంగ అయిన ఎక్కడో అక్కడ దొరికిపోతాడు. ఆ క్రమంలోనే అతడి చేతికి ఉన్న ఆరో వేలే అతడిని పట్టిచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని షాసాబ్ గుట్టకు చెందిన ఉంద్యాల శేఖర్‌రెడ్డి అలియాస్ వడ్డే శేఖర్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన అతడు తన సంపాదన సరిపోకపోవడంతో ఏటీఎంల్లో దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు.

ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాసి అక్కడికి వచ్చిన అమాయకులను ఏమర్చి కార్డులను మార్చి దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే 2017 సంవత్సరం నుంచి పాలమూరు, మరికల్, నారాయణపేటలో ఏటీఎం దొంగతనాలు, కేశంపేటలో ద్విచక్రవాహనం దొంగతనం, ఓ ఇంటిలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసులకు దొరికి జైలు శిక్ష అనుభవించాడు. గత నెల 23న వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సలీంపూర్‌కు చెందిన యాదయ్య రైతు బంధు డబ్బులు తీసుకునేందుకు కోస్గికి వచ్చాడు.

ఓ ప్రైవేటు ఏటీఎం వద్దకు రాగా అప్పటికే అక్కడ ఉన్న శేఖర్ రెడ్డి నమ్మించి రూ.2వేలు డ్రా చేసి ఇచ్చాడు. ఆ రైతు యాదయ్యకు చెందిన ఏటీఎం కార్డు మార్చి.. కొత్త కార్డు ఇచ్చి పంపాడు. అదే రోజు యాదయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.27వేలు డ్రా చేసుకుని పరారయ్యాడు. వారం రోజుల తర్వాత బాధితుడు మరోసారి ఏటీఎం కేంద్రానికి రావడంతో తన ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన విషయం బయటపడింది. దీంతో యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎంలోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. అయితే దొంగ కుడి చేతికి ఉన్న ఆరు వేళ్లు ఉన్నట్టుగా గుర్తించారు. దర్యాప్తులో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన పాత ఏటీఎం కేసులను పరిశీలించగా శేఖర్ రెడ్డి బండారం బయటపడింది. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు నాగర్‌కర్నూలులో ఉన్నట్టు గుర్తించి శుక్రవారం శేఖర్‌రెడ్డిని పట్టుకున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading