ఆటో(Auto)లంటేనే అధిక లోడ్‌తో నడిచే వాహనాలు అనే పేరుంది. కెపాసిటీ మించి జనాన్ని ఎక్కించుకుని వెళ్లే వాహనాల్లో ఆటోలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయి. కాని అలాంటి ఆటోని ఏకంగా మినీ బస్(Mini bus)గా మార్చాడో వ్యక్తి. డ్రైవర్(Driver)తో పాటు నలుగురు మాత్రమే ప్రయాణించే సామర్ధ్యం కలిగిన ఆటోలో పది, పదిహేను మంది కాదు ఏకంగా 27మంది(27 people)ని ఎక్కించుకొని తీసుకెళ్తున్న వీడియో (Video)ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతోంది. డ్రైవర్ కక్కూర్తిని..అందులో కూర్చున్న జనాన్ని చూసి నెటిజన్లు (Netizens)తెగ కామెంట్స్ చేస్తున్నారు.
డేంజర్ జర్నీ ..
నలుగురు, ఐదుగురు మాత్రమే ప్రయాణించే ఆటోను మినీ బస్‌గా మార్చేశాడో డ్రైవర్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనో లేక ఒకే కిరాయికి రెండు ట్రిప్పులు ఎందుకు అనుకున్నాడో ఏమో కాని ..పది , పదిహేను మంది కాదు ఒకేసారి ఆటోలో 27మందిని ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో బింద్కి కొత్వాలి ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఆటో రిక్షాలో బయలుదేరారు. బింద్కీ ప్రాంతంలోని లాలౌలీ చౌరస్తా దగ్గరకు రాగానే ఆటో డ్రైవర్ అతివేగంగా నడపటం చూసిన పోలీసులు ఆటోని ఫాలో అయ్యారు. ఆటోలో సామర్ధ్యానికి మించి జనాన్ని ఎక్కించుకున్న విషయం కాకుండా..కేవలం స్పీడుగా డ్రైవ్ చేశాడని పోలీసులు ఆటోని ఆపారు. లోపల కూర్చున్న జనాన్ని చూసి షాక్ అయ్యారు పోలీసులు.
ఒకే ఆటోలో 27మంది ప్రయాణం..
ఒకరిద్దరు కాదు ఆటోలో 27మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించి వారిని ఆటో దింపించారు. పోలీసులు ఒక్కొక్కరిని లెక్కబెట్టడంతో లోపల 27మందిని కూర్చోబెట్టినట్లుగా నిర్ధారిచారు. ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్లంతా మెహ్రాహ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బక్రీద్ పండుగ ఉండటంతో నమాజ్ చేయడానికి బింద్కీకి వచ్చినట్లుగా తెలిపారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మినీ బస్‌గా మార్చాడు..
ఒక్క ఆటోలో డ్రైవర్‌తో పాటు 27మంది ఎలా కూర్చున్నారనే విషయంపైనే స్థానికులు చర్చించుకుంటున్నారు. నలుగురు కూర్చుంటేనే ఐదో వ్యక్తికి ఇబ్బందిగా ఉంటే చిన్న ఆటోను మినీ బస్‌గా మార్చిన డ్రైవర్ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే పోలీసులు మాత్రం పండుగ పూట ఇలాంటి స్టంట్‌లు చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video