హోమ్ /వార్తలు /క్రైమ్ /

Extra marital affair : రాసలీలల కేసులో బుక్కైన TRSనేత .. బాధితుడ్నే కిడ్నాప్ చేయించినందుకు కేసు నమోదు

Extra marital affair : రాసలీలల కేసులో బుక్కైన TRSనేత .. బాధితుడ్నే కిడ్నాప్ చేయించినందుకు కేసు నమోదు

sangareddy trs leader

sangareddy trs leader

Extra marital affair: అధికార పార్టీ నేత బంధువైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం ఆమె భర్తకు తెలిసిందని అతడ్ని కిడ్నాప్ చేయించాడు. చివరకు అతడి దగ్గరున్న సాక్ష్యాలను తొలగించినప్పటికి పోలీసులకు దొరికిపోయాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

తెలంగాణ(Telanga)లో అధికార పార్టీకి అప్రతిష్ట తెచ్చే విధంగా కొందరు నాయకులు అసాంఘీక కార్యక్రమాలుకు పాల్పడుతున్నారు. ద్వితియ శ్రేణి నాయకులుగా ఉండి బెదిరింపులు, బలత్కారాలు, రాసలీలలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. సంగారెడ్డి(Sangareddy)జిల్లా అమీన్‌పూర్‌ (Aminpur)మున్సిపాలిటీ కో.ఆప్షన్ మెంబర్‌ (Municipality Co Option Member) భర్త, స్థానికంగా పాస్టర్‌గా ఉంటూనే పాడుపని చేసి దొరికిపోయాడు. ఈవిషయంలో బంధువుతోనే వివాహేతర సంబంధం(Extra marital affair)పెట్టుకోవడమే కాకుండా ఆమె భర్తను చంపుతానని బెదిరించడంతో సదరు టీఆర్ఎస్‌ నేతపై పోలీస్ కేసు నమోదైంది.

KCR | Singareni : సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్‌ దసరా కానుక .. సంస్థ లాభాల్లోంచి 30శాతం వాటా ఇవ్వాలని ఆదేశం

టీఆర్ఎస్‌ నేత రాసలీలలు ..

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌కి చెందిన టీఆర్ఎస్ నేత, పాస్టర్ దేస శిఖామణిపై రాసలీలల వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమీప బంధువు అయినటువంటి రాజు అనే వ్యక్తి భార్యతో దేవశిఖామణి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈవిషయాన్ని రాజు పసిగట్టాడు. భార్యతో పాటు దేవశిఖామణికి తెలియకుండా ఇంట్లో అధికార పార్టీ నేత రాసలీలలను షూట్ చేశాడు. ఈవిషయం దేవశిఖామణికి తెలియడంతో తన అనుచరులతో రాజును కిడ్నాప్ చేయించాడు.

15రోజుల తర్వాత గుట్టు రట్టు..

ఈసంఘటన జరిగి 12రోజులు దాటింది. టీఆర్ఎస్‌ నేత తన రాసలీలకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేయకపోతే చంపుతానంటూ బెదిరించాడు. బాధితుడు రాజు భయపడిపోయి వీడియోలు డిలీట్ చేశాడు. చివరకు మంగళవారం తనను కిడ్నాప్ చేసిన విషయాన్ని...అందుకు కారణం తన భార్యతో టీఆర్ఎస్‌ నేత వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని అమీన్పూర్‌ పోలీసులకు కంప్లైంట్ చేశాడు రాజు. బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు 448, 363, 324, 342, 506 R/W 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

Crime news : రెండు రాష్ట్రాల పోలీసులకు చెమటలు పట్టించిన హర్యానా గ్యాంగ్ .. ఖాకీ సినిమా స్టైల్లో చేజింగ్

పాస్టర్‌ స్పందన ఎలా ఉంటుందో...?

బాధితుడు అక్క భర్తే శిఖామణిగా పోలీసులు గుర్తించారు. 2021లో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో శిఖామణి టీఆర్ఎస్‌లో చేరారు. 15రోజుల క్రితం జరిగిన ఈ రాసలీలల వ్యవహారం ఇప్పుడు బయటకు రావడంతో దీనిపై శిఖామణి తన వాదన ఇవాళ, రేపట్లో వినిపించనున్నట్లుగా తెలుస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Sangareddy, Telangana crime news

ఉత్తమ కథలు