హైటెక్ సెక్స్ రాకెట్ దందా గుట్టు రట్టు...పోలీసుల ఎంట్రీతో గేమ్ క్లోజ్

పలువురు కాల్ గర్ల్స్ ఈ వాట్సప్ గ్రూపుల్లో ఉంటూ...తమ దందా నడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మాజీ పోలీసు....ఓ విటుడిలా వెళ్లాడు. వ్యభిచారం నిర్వహిస్తున్న వాట్సప్ గ్రూపులో చేరి నిఘా వేశాడు.

news18-telugu
Updated: October 5, 2020, 12:53 AM IST
హైటెక్ సెక్స్ రాకెట్ దందా గుట్టు రట్టు...పోలీసుల ఎంట్రీతో గేమ్ క్లోజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్ దెబ్బతో వ్యభిచారం బంద్ అయ్యింది. దీంతో నిర్వాహకులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా కొందరు నిర్వహకులు తమ ప్రచారాన్ని సులువుగా చేసుకునేందుకు సోషల్ మీడియాలో దందా స్టార్ట్ చేశారు. వాట్సప్ లో ప్రత్యేకంగా ‘గ్రూపును ఏర్పాటు చేసి. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేయడం స్టార్ట్ చేశారు. నచ్చినవారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబరును సైతం పెడుతున్నారు. గతంలోనూ ఇలాంటి గ్రూపును ఏర్పాటు చేశారు. కానీ అది కొద్దిరోజుల పాటు నిలిచిపోయింది. తాజాగా తిరిగి ఆ టెలిగ్రాం యాప్ ద్వారా ఈ గ్రూపు యాక్టివ్‌గా మారింది.

ఈ హైటెక్ వ్యభిచార ముఠా పూనే కేంద్రంగా పనిచేస్తోంది. పలువురు కాల్ గర్ల్స్ ఈ వాట్సప్ గ్రూపుల్లో ఉంటూ...తమ దందా నడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మాజీ పోలీసు....ఓ విటుడిలా వెళ్లాడు. వ్యభిచారం నిర్వహిస్తున్న వాట్సప్ గ్రూపులో చేరి నిఘా వేశాడు. అందులో నిర్వాహకుల తీరు, అక్కడి యువతులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం తాను నిర్వాహకులకు ఫోన్ చేసి తనకో అమ్మాయి కావాలని ఫోన్ చేశాడు. ఆయనతో మాటామంతీ పూర్తి చేసుకుని నిర్వాహకులతో రూ.50 వేలకు ఓ మంచి మోడల్ ను కాల్ గర్ల్ గా పంపుతామన్నారు. ఒప్పందం చేసుకున్న పావుగంటకే నిర్వాహకులు అనుకున్న మాట ప్రకారం..అమ్మాయిని పంపే ఏర్పాటు చేశారు. అయితే ఆ మాజీ పోలీసు మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ మోడల్ ను అదుపులోకి తీసుకొని విచారించి హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. నిర్వామకులను అదుపులోకి తీసుకున్నారు.
Published by: Krishna Adithya
First published: October 5, 2020, 12:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading