హోమ్ /వార్తలు /క్రైమ్ /

బయట నుంచి మూసి ఉన్న హోటల్.. లోపల మాత్రం వ్యభిచార దందా.. కస్టమర్లుగా వెళ్లిన పోలీసులు.. ఆ తరువాత..

బయట నుంచి మూసి ఉన్న హోటల్.. లోపల మాత్రం వ్యభిచార దందా.. కస్టమర్లుగా వెళ్లిన పోలీసులు.. ఆ తరువాత..

అమ్మాయిల కోసం వ్యక్తుల వ్యక్తిగత పరిచయాల ద్వారా బ్రోకర్‌లను సంప్రదించి.. ఆపై వారి మొబైల్‌లో అమ్మాయి ఫోటోను పొందుతారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాత.. అమ్మాయిని హోటల్‌ తీసుకొస్తాడు.

అమ్మాయిల కోసం వ్యక్తుల వ్యక్తిగత పరిచయాల ద్వారా బ్రోకర్‌లను సంప్రదించి.. ఆపై వారి మొబైల్‌లో అమ్మాయి ఫోటోను పొందుతారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాత.. అమ్మాయిని హోటల్‌ తీసుకొస్తాడు.

అమ్మాయిల కోసం వ్యక్తుల వ్యక్తిగత పరిచయాల ద్వారా బ్రోకర్‌లను సంప్రదించి.. ఆపై వారి మొబైల్‌లో అమ్మాయి ఫోటోను పొందుతారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాత.. అమ్మాయిని హోటల్‌ తీసుకొస్తాడు.

  ఢిల్లీ పోలీసులు సంచలనం రేపుతున్న సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కింగ్‌పిన్, ఒక అమ్మాయితో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యభిచార రాకెట్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విస్తరించింది. ఈ వ్యాపారం కోసం ఒక హోటల్‌ను లీజుకు తీసుకున్నారు. మార్చి 21న ఏరోసిటీ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో వ్యభిచార రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సరైన సమయంలో దాడులు చేసేందుకు పోలీసు అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. రైడింగ్ బృందం ఏరోసిటీ ప్రాంతానికి చేరుకుంది. రహస్య ఇన్ఫార్మర్ ద్వారా నవీన్ అనే బ్రోకర్‌ను సంప్రదించారు. నిందితుడి జాడ కోసం హోటల్ హాలిడే ఇన్‌లో గది కూడా బుక్ చేశారు. కస్టమర్ వేషంలో వెళ్లిన పోలీస్ అధికారి వేచి ఉన్న హోటల్‌కి నవీన్ ఒక అమ్మాయిని పంపాడని పోలీసులు తెలిపారు.

  అమ్మాయిని హోటల్‌లో దించి అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి హోటల్ గదికి చేరుకుని కస్టమర్‌గా వచ్చిన పోలీస్ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుంది. పోలీస్ సూచన మేరకు దాడి చేసిన ప్రత్యేక బృందం హోటల్ గదిలోకి ప్రవేశించి, మహిళా పోలీసు అధికారి సహాయంతో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో అమ్మాయిని డ్రాప్ చేసేందుకు వచ్చిన బ్రోకర్ నవీన్‌ను హోటల్ బయటి నుంచి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

  కేసు విచారణ సందర్భంగా బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన నవీన్ నుండి ఆధారాలను సేకరించి, మరో నిందితుడు రియాష్ సిద్ధిఖీని పట్టుకున్న పోలీసులు.. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో మరిన్ని దాడులు నిర్వహించారు. నిందితులను రియాష్ సిద్ధిఖీ, నవీన్‌గా గుర్తించినట్లు ఐజీఐ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ త్యాగి తెలిపారు. ఈ కేసులో అనైతిక అక్రమ రవాణా చట్టంలోని సెక్షన్‌ 4, 5 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు ఇద్దరూ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారని.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 45లో ఒక హోటల్‌ను లీజుకు తీసుకున్నారని తెలిపారు.

  Shocking: వామ్మో.. షాపులో మనిషి ... మెదడు, కళ్లు, చెవులు.. అసలేం జరిగిందంటే..

  Siddipet: లక్ష రూపాయలు ఇవ్వలేదని కన్నతల్లిపై ..

  వారి ముగ్గురు సహచరులతో కలిసి ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లలో వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారని తదుపరి విచారణలో తేలినట్టు తెలిపారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి అమ్మాయిల కోసం వ్యక్తుల వ్యక్తిగత పరిచయాల ద్వారా బ్రోకర్‌లను సంప్రదించి.. ఆపై వారి మొబైల్‌లో అమ్మాయి ఫోటోను పొందుతారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాత.. అమ్మాయిని హోటల్‌ తీసుకొస్తాడు. ఆ తరువాత తర్వాత అమ్మాయి కస్టమర్ నుండి డబ్బు తీసుకుంటుంది. హోటల్ మూసి ఉన్న గదులలో వ్యాపారం ప్రారంభమవుతుంది. కొన్ని నెలల నుంచి సాగుతున్న ఈ చీకటి వ్యవహారానికి పోలీసులు చెక్ చెప్పారు.

  First published:

  Tags: Prostitution racket

  ఉత్తమ కథలు