• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • POLICE BUSTED DRUG RACKET IN VISAKHAPATNAM SU

విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు వ్యక్తుల అరెస్ట్

విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు వ్యక్తుల అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

విశాఖలో డ్రగ్స్ దందా సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    విశాఖలో డ్రగ్స్ దందా సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి లైసర్జిక్ యాసిడ్ డైఇథైలమైడ్(ఎల్‌ఎస్‌డీ) బోల్ట్స్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. వివరాలు.. విశాఖ పీఎం పాలెంలో నివాసం ఉంటున్న అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి కొంతకాలం బెంగళూరులో చుదువుకున్నాడు. అయితే ఆ సమయంలో అతను ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ గురించి తెలసుకున్నాడు. వాటి గురించి మంచి ఐడియా ఉన్న అరవింద్.. విశాఖ తిరిగివచ్చాక డ్రగ్స్ దందా ప్రారంభించాడు. డ్రగ్స్ విక్రయించి భారీగా డ్రగ్స్ సంపాదించుకోవాలని భావించాడు.

    తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. తొలుత అరవింద్.. ఆన్‌లైన్‌లో డార్క్ వెబ్‌సైట్‌లో బిట్‌కాయిన్ విధానంలో ఒక్కో ఎల్‌ఎస్‌డీ రూ. 400 చొప్పున కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు. ఇలా కొనుగోలు చేసిన ఎల్‌ఎస్‌డీని తన చిన్ననాటి స్నేహితులకు రూ. 1000 చొప్పున విక్రయించేవాడు. ఈ డ్రగ్‌ను వారు కాలేజ్ విద్యార్థులకు రూ. 2000 చొప్పున విక్రయించేవారు. అయితే ఈ డ్రగ్ దందాపై పక్కాసమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఆ ముఠా గుట్టు రట్టు చేశారు.

    ఈ కేసుకు సంబంధించి అరవింద్‌తో పాటు అతని చిన్ననాటి స్నేహితులు కె సాహిల్, బిల్లా చంద్రశేఖర్, మురళీధర్, మైఖేల్ వెల్‌కమ్‌లను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 27 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఈ ముఠాకు చెందిన అశోక్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందడంతో అతన్ని అరెస్ట్ చేయలేదు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు