ఆరుగురు యువతులతో వ్యభిచారం.. భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆరుగురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను బుధవారం డెహ్రూడూన్ పోలీసులు పట్టుకున్నారు.

news18-telugu
Updated: September 13, 2019, 1:34 PM IST
ఆరుగురు యువతులతో వ్యభిచారం.. భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆరుగురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను బుధవారం డెహ్రూడూన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్‌లో ఏడుగురు ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఆరుగురు యువతులను డెహ్రాడూన్‌కు రప్పించి, వారికి ఉద్యోగం ఇప్పిస్తామని ఎర వేశారు. అక్కడికి వెళ్లాక ఓ ఇంటిలో వారితో వ్యభిచారం చేయించారు. అక్కడే కాకుండా వారిని వివిధ ప్రాంతాలకు పంపిస్తూ సెక్స్ రాకెట్ నడిపారు. అయితే, ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రంగంలోకి దూకిన పోలీసులు నిఘా పెట్టి ఓ చోట కారులో నిందితులను అదుపులోకి తీసుకొని, యువతులను రక్షించారు.

అమిత్ అనే వ్యక్తి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లయింట్లు ఇచ్చే డబ్బులో 75 శాతం బ్రోకర్ తన వద్ద ఉంచుకొని మిగతా 25 శాతం డబ్బును యువతులకు ఇస్తున్నట్లు తేలింది. ఇదిలా ఉండగా, సిమ్లాలోనూ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులను పోలీసులు రక్షించారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు