POLICE BEAT UP A YOUNG MAN HARASSING A YOUNG WOMAN IN UTTAR PRADESH SNR
Viral Video: లవ్ చేయమని టార్చర్ పెట్టాడు..యూపీ పోలీసులు ఎలాంటి ట్రీట్ ఇచ్చారో చూడండి
Photo Credit:Youtube
Uttar Pradesh: యూపీలో ఆడపిల్లను వేధిస్తున్న పోకిరికి పోలీసులు దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కాన్పూర్‌లో యాంటీ రోమియో స్క్వాడ్ పోలీసులు యువకుడ్ని పట్టుకొని చెంప పగలగొట్టారు. పోలీసులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో యోగీ సర్కారు అమ్మాయిల భద్రతపై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. పోకిరి వెదవలు, అమ్మాయిల వెంట పడి వేధించే వాళ్లు, ఆడపిల్లల్ని మోసం చేయాలని చూసే యువకులను పట్టుకొని తగిన గుణపాఠం చెబుతున్నారు అక్కడి అధికారులు. తాజాగా కాన్పూర్ (Kanpur)పోలీసులు (Police)ఓ పోకిరికి నడిరోడ్డుపై దేహశుద్ధి చేసిన వీడియో వైరల్(Video Viral) అవుతోంది. ఈ వీడియో చూసైన కుర్రాళ్లు అమ్మాయిల పట్ల జాగ్రత్తగా నడుచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. కాన్పూర్‌లోని గ్వాల్టోలి పోలీస్ స్టేషన్ పరిధి రాణిగంజ్కి చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని ఓ అబ్బాయి నిరంతరం వేధిస్తున్నాడని ఏసీపీ త్రిపురారి పాండే(Tripurari Pandey)కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ పోకిరి వెదవ కోసం కాపు కాశారు యాంటీ రోమియో స్క్వాడ్ (Anti Romeo Squad)పోలీసులు. అతడ్ని గుర్తు పట్టేందుకు యువతితో పాటు బాధితురాలి తండ్రి వెంట రావడంతో పోలీసులు గుర్తు పట్టారు. పోకిరి వెదవ బైక్‌పై వెళ్తుండగా ఆపి చెంప పగలగొట్టారు. పోలీసులు ఇచ్చిన షాక్‌కి యువకుడికి ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు. యువకుడ్ని చెంపపై కొట్టడమే కాకుండా జుట్టు పట్టకొని ఇంకొకసారి అమ్మాయిల వెంట పడినా, వేధించినా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
నడిరోడ్డుపైనే శిక్ష..
తన కుమార్తెను నిందితుడు టార్చర్ పెడుతున్న విషయం తెలుసుకున్న తండ్రి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయిల వెంటపడుతున్న పోకిరీకి తగిన బుద్ధి చెప్పమని మందలించమని చెప్పినప్పటికి మారకపోవడంతో పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న కాన్పూర్ పోలీసులు నిమిషాల వ్యవధిలో పోకిరిని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని తండ్రి ఫిర్యాదుతో యాక్షన్ తీసుకున్నారు పోలీసులు.
రోమియోకి దేహశుద్ధి..
ప్రేమ పేరుతో వెంటపడటం, పరిచయం పేరుతో వేధించడం వంటివి చేయకుండా ఉందేందుకు యువకులు, పోకిరి వెదవలను పట్టుకొని తాట వొలిచేస్తున్నారు యూపీ పోలీసులు. ఆడపిల్లల భద్రతకు పెద్దపీఠ వేస్తామని చెప్పిన సీఎం యోగీ..అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇకపై ఎవరైనా అమ్మాయిల జోలికి వచ్చినా, మోసం చేసి ముఖం చాటేసిన వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు. పోకిరికి దేహశుద్ధి చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పోలీసులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.