పెట్రోల్ పోసుకొని పోలీస్ ఆత్మహత్యాయత్నం.. హైదరాబాద్‌లో కలకలం

సీఐ సైదులు నరసింహను అన్యాయంగా బదిలీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు సీఐ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేశారని.. అందుకే అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.

news18-telugu
Updated: November 22, 2019, 5:35 PM IST
పెట్రోల్ పోసుకొని పోలీస్ ఆత్మహత్యాయత్నం.. హైదరాబాద్‌లో కలకలం
పెట్రోల్ పోసుకొని పోలీస్ ఆత్మహత్యాయత్నం.
  • Share this:
హైదాబాద్‌లోని బాలపూర్‌లో తీవ్ర కలకలం రేగింది. ఏఎస్‌ఐ నరసింహ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుటే అందరి ముందే ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేసి అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో నరసింహ చికిత్స పొందుతున్నారు. వీపు భాగంలో కాలిన గాయాలు అయ్యాయని.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఏఎస్‌ఐ నరసింహ ప్రస్తుతం మంచాల పీఎస్‌లో పనిచేస్తున్నారు. అంతకు ముందు బాలాపూర్‌ పీఎస్‌లో విధులు నిర్వర్తించారు.
సీఐ సైదులు.. నరసింహను అన్యాయంగా బదిలీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు సీఐ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేశారని.. అందుకే అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2019, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading