Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: తెలంగాణలో గుప్త నిధుల వేట.. అంజనం వేసి అపరిచితుల నివాసాల్లో తవ్వకాలు.. ఒప్పుకోకపోతే హత్యే..

Telangana: తెలంగాణలో గుప్త నిధుల వేట.. అంజనం వేసి అపరిచితుల నివాసాల్లో తవ్వకాలు.. ఒప్పుకోకపోతే హత్యే..

నిందితును చూపుతున్న పోలీసులు

నిందితును చూపుతున్న పోలీసులు

డిజిటల్‌‌ యుగంలోనూ మూఢ నమ్మకాలు.. అంధ విశ్వాసాలతో మనుషులు దుర్మార్గాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ధనార్జన కోసం కొందరు మానవత్వం మరచి సాటి వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసే సంస్కృతి సైతం అక్కడక్కడ కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గానికి దక్షిణాది అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం పట్టణం తాజాగా కేంద్రంగా మారింది.

ఇంకా చదవండి ...

డిజిటల్‌‌ యుగంలోనూ మూఢ నమ్మకాలు.. అంధ విశ్వాసాలతో మనుషులు దుర్మార్గాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ధనార్జన కోసం కొందరు మానవత్వం మరచి సాటి వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసే సంస్కృతి సైతం అక్కడక్కడ కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గానికి దక్షిణాది అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం పట్టణం తాజాగా కేంద్రంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణకు చెందిన నల్లగొండ, ఇంకా కొందరు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లంతా ఒక ముఠాగా తయారయ్యారు. వీరంతా ఎప్పుడో వందల ఏళ్ల క్రితం రాజులు దాచిపెట్టారని భావిస్తున్న గుప్త నిధుల తవ్వకాల కోసం బయలుదేరారు. వీరికి గురువుగా చెబుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి అంజనం వేసి చెప్పిన చిరునామాలో తవ్వకాలు చేపట్టడానికి ఈ ముఠా బయలు దేరింది. సదరు గురువు శ్రీనివాస్‌ అంజనం వేసి చెప్పిన చిరునామాలో ఇళ్లున్నా.. రోడ్డున్నా.. ఏది ఉన్నా ఎలాగైనా తవ్వాలన్న ఉద్దేశంతో ఈ ముఠా భద్రాచలం చేరుకుంది. తీరా ఆ గురువు చెప్పిన అడ్రస్‌ భద్రాచలం పట్టణంలోని రాజుపేటలో ఉన్న ఓ ఇల్లుగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ ఇంట్లో మూడొందల కోట్ల విలువైన నిధి ఉన్నదని, అక్కడ పూజలు చేసి తవ్వకాలు చేపడితే నిధి సొంతమవుతుందని ఆ గురువు ఈ ముఠాకు చెప్పాడు. దీంతో ఓ వాహనంలో భద్రాచలం చేరుకున్న ఈ ముఠా సభ్యులు రెక్కీ నిర్వహించారు. ఎలాగైనా ఆ ఇంట్లోని నిధిని సొంతం చేసుకోవాలని పథకం రచించారు. కుదిరితే మంచి మాటలు చెప్పి.. నిధి దొరికాక వాటాలు పంచుకునేలా.. లేదంటే రాత్రి పూట దౌర్జన్యంగా నైనా నిధిని సొంతం చేసుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇందు కోసం కావాల్సిన పనిముట్లు, పరికరాలను సమకూర్చుకున్నారు. ముందుగా ఇంటి వాళ్లతో మంచిగా మాట్లాడి తవ్వకాలు చేయడం, లేదంటే చంపేస్తామని బెదిరించి లొంగదీసుకుని ఆ నిధిని కాజేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు.

ఏం చేసైనా ఆ నిధిని మాత్రం సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఇంటివాళ్లను బెదిరించడానికి ఓ తుపాకిని, ఇంకా వాళ్లు ప్రకారం వారు తలుపులు తీయకపోతే పగులగొట్టుకుని వెళ్లడానికి అనువుగా లాక్‌ కట్టర్లు, కడ్డీలు లాంటివి సమకూర్చుకున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్టు ప్లాన్‌ సక్సెస్‌ అయితే ఆ నిధితో ఏ రూట్‌లో పారిపోవాలన్న దానిపై కూడా వర్కవుట్‌ చేశారు. దీనికోసం భద్రాచలం పట్టణంలో నుంచి త్వరగా బయటపడేందుకు ఉన్న రూట్లలో రెక్కీ నిర్వహించారు. ఇక్కడే వారి ప్లాన్‌ బెడిసికొట్టింది. వారిని కటకటాల వెనక్కు నెట్టేసింది. ఈ ముఠా సభ్యులు భద్రాచలం పట్టణంలో తిరుగుతున్న సమయంలోనే పట్టణ పోలీసులు ఫూట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

వాస్తవానికి పోలీసుల టార్గెట్‌ వీళ్లు కాదు. చత్తీస్ గడ్‌ అడవుల్లోంచి ఎవరైనా మావోయిస్టులు చొరబడ్డారా.. లేదంటే వాహనాల్లో గంజాయి రవాణా ఏమైనా చేస్తున్నారా అన్న దానిపై పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే రకరకాల వ్యూహాలతో పోలీసులు పనిచేస్తున్నారు. అదే క్రమంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న గుప్తనిధుల వేట ముఠా తారసపడింది. రకరకాల ప్రశ్నలు వేశాక.. అనుమానం వచ్చి వాహనం తనిఖీ చేశారు. వారి ఎలాంటి పెద్దదైన ఇనుప కడ్డీనైనా కట్‌ చేయడానికి అనువైన ఓ పెద్ద కట్టరు, తాళాలు సులభంగా తీయగలిగేలా పనికొచ్చే కడ్డీలు, ఇంకా ఓ తుపాకీ లభించింది. దీంతో ఆ ముఠాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం స్టోరీ వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ముఠా సభ్యులందరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే వారి నుంచి లభ్యమైన తుపాకీ మాత్రం నకిలీదని పోలీసులు తేల్చారు.

First published:

Tags: Bhadrachalam, Crime news, Telangana Police

ఉత్తమ కథలు