Home /News /crime /

POLICE ARRESTS 15 PEOPLE FOR SOCIAL MEDIA POST SUPPORTING TALIBAN IN ASSAM SU

తాలిబన్లకు మద్దతుగా పోస్ట్‌లు.. 15 మంది అరెస్ట్.. అరెస్ట్ అయిన వారిలో పోలీసుతో పాటుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అఫ్గానిస్తాన్‌ను అక్రమించుకున్న తాలిబన్లకు మద్దతుగా పోస్టులు పెట్టిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది.

    అఫ్గానిస్తాన్‌ను అక్రమించుకున్న తాలిబన్లకు మద్దతుగా పోస్టులు పెట్టిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. తాలిబన్ల అక్రమణకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టిన అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా శనివారం పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ అరెస్ట్‌లు చేసినట్టుగా చెప్పారు. వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఐటీ చట్టం, సీఆర్‌పీసీ‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయినవారిలో ఓ కానిస్టేబుల్, ఓ సీనియర్ జమియత్ లీడర్, ఓ జర్నలిస్ట్, ఓ టీచర్ కూడా ఉన్నారు.

    చట్టానికి వ్యతిరేకంగా తాలిబన్ కార్యకలాపాలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసిన వారిని అసోం పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోషల్ మీడియాలో తాలిబన్ల పోస్ట్‌లపై జాగ్రత్తగా ఉండాలని.. వాటిని లైక్ చేయడం, రీట్వీట్ చేయవద్దని ప్రజలకు సూచించారు.

    డీఐజీ వాయ్లెట్ బరువా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అఫ్ఘానిస్తాన్‌కు మద్దతుగా వస్తున్న పోస్టులపై తాము దృష్టి సారించామని చెప్పారు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి పోస్టులను పోలీసుల అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.

    చదవండి: కాబూల్ నుంచి 168 మంది ప్రయాణికులు. ఉత్తరప్రదేశ్‌లో ఫ్లైట్ ల్యాండ్

    అరెస్ట్ అయినవారిలో.. కామరూప్, బార్పేటా, ధుబారీ, కరీమ్‌గంజ్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున, దరంగ్, దక్షిణ సల్మారా, గోవాల్‌పారా, హోజాయీ, హైలాకండి, కచర్ జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. హైలాకండి జిల్లాలో అరెస్ట్ అయిన వ్యక్తి .. సోనిపేట్ జిల్లాలోని తేజ్‌పూర్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి అని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇదేరకమైన ఆరోపణలపై శనివారం బక్సా జిల్లాలో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బరువా డీఐజీ పిటిఐకి తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Afghanistan, Assam, Social Media, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు