హోమ్ /వార్తలు /క్రైమ్ /

Cheating: వలపు వల విసిరి.. చాటింగ్ తో రెచ్చగొట్టి..

Cheating: వలపు వల విసిరి.. చాటింగ్ తో రెచ్చగొట్టి..

పోలీసులు అదుపులో నిందితులు

పోలీసులు అదుపులో నిందితులు

Cheating: యువకులకు ప్రేమ పేరుతో మాయమాటలు చెబుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేస్తున్న యువతిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువతి చేతిలో మోసపోయిన వారు సంప్రదించాలని పోలీసులు సూచించారు.

ఆమెకు ఎలాంటి ఉద్యోగం లేదు. దీంతో ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి వలపు వల విసరడమే వృత్తిగా మార్చుకుంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు గుంజడమే లక్ష్యంగా లక్షలు సంపాదించడాన్నే పనిగా పెట్టుకుంది. తనకు తోడుగా కొందరితో కలిసి ముఠాగా ఏర్పడింది. తాను సంచరించే ప్రాంతాల్లో ఊద్యోగాలు లేని అమాయక యువకులను గుర్తించి వారికి తాను కరీంనగర్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కూడా విధులు నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకునేది. అధికారుల వద్ద తనకు పలుకుబడి ఉన్నట్లు నమ్మించేది. మీకు ప్రభుత్వ ఆస్పత్రిలో క్లర్క్ ఊద్యోగం ఇప్పిస్తానని, లేకపోతే క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పేది. అందుకు రిజిస్ట్రేషన్, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చు అవుతాయని నమ్మించేది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి అమాయక యువకుల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ వస్తుంది.

మరి కొన్ని సందర్భాలలో తాను వరంగల్ లోని ప్రముఖ వైద్యురాలి కుమార్తె నిఖితారెడ్డి గా పరిచయం చేసుకుని వారితో స్నేహం పేరుతో చాటింగ్ చేసేది. ఆ చాటింగ్, కాల్ రికార్డింగ్ లతో బెదిరించి డబ్బులు లాగేది. బాధితుల మోసపోయినట్లుగా గుర్తించి తిరిగి డబ్బులు అడిగితే తన మూఠా సభ్యులను పెద్ద మనుషులుగా చూపించి పంచాయితీ పెట్టేది. చాటింగ్, సంభాషణలు చూపిస్తూ ఎదురు కేసులు పెడతామని బెదిరించేది. ఇలా అనేక మంది అమాయకులను నమ్మించి మోసం చేసింది. ఎట్టకేలకు ఆ కిలాడీ బాగోతం బయటపడింది. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు.

వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతీ MLT చదివి ఊద్యోగం లేక ఖాళీగా ఉంటోంది. కుటుంబ సభ్యులతో విడిపోయి కరీంనగర్ లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా నివసిస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ ఆ యువతి సులభంగా డబ్బులు సంపాదించడానికి అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని వారితో ఆడుకోవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో నిందితురాలు, తన మూఠా సభ్యులతో కలసి కరీంనగర్ లోని సిఖ్వాడి ప్రాంతానికి చెందిన యువకుడి వద్ద వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఊద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. అంతటితో ఆగకుండా క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు వసూలు చేసింది. కరీంనగర్ లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరొక వ్యక్తికి ప్రభుత్వ ఊద్యోగం ఇప్పిస్తానని రూ.7 లక్షలు వసూలు చేసింది. ఇలానే గోదావరిఖనికి చెందిన మరో యువకుని వద్ద రూ. 3 లక్షలు వసూలు చేసింది.

వరంగల్ కు చెందిన మరో యువకుడితో నిఖితారెడ్డి గా పరిచయం చేసుకుని ముగ్గులోకి దించింది. అతనితో సన్నిహితంగా చాటింగ్ చేసిన సంభాషణలతో బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి రూ.8 లక్షలు వసూలు చేసింది. ఈ ముఠాపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు వీరిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తూ.. అమాయకులను మోసం చేసే వారి మాయమాటలు నమ్మి డబ్బు, సమయం నష్ట పోవద్దని సూచించారు. అలాంటి మోసగాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే వారి సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ కేసులతో నిందితులైన బెల్లంపల్లికి చెందిన యువతీ, కంబాల రాజేష్, కుసుమ భాస్కర్, భీమా శంకర్ ను అరెస్టు చేశామన్నారు. వీరిపైన కరీంనగర్ ఒకటవ పోలీస్ స్టేషతో పాటు, హైదరాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లి, వరంగల్ మిల్స్ కాలనీ, గోదావరిఖని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ నిందితుల చేతిలో ఎవరైనా మోసపోయిన వారు ఉంటే పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. వీరి వద్ద నుండి ఇరవై వేల నగదు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

First published:

Tags: Karimangar, Love cheating, Police

ఉత్తమ కథలు