Home /News /crime /

Hyderabad : లిఫ్టు పేరుతో దోపిడిలు.. ఫ్లైట్‌లో ప్రయాణాలు.. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి అడ్డాలు..

Hyderabad : లిఫ్టు పేరుతో దోపిడిలు.. ఫ్లైట్‌లో ప్రయాణాలు.. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి అడ్డాలు..

Hyderabad :  లిఫ్టు పేరుతో దోపిడిలు..  ఫ్లైట్‌లో ప్రయాణాలు.. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి అడ్డాలు.

Hyderabad : లిఫ్టు పేరుతో దోపిడిలు.. ఫ్లైట్‌లో ప్రయాణాలు.. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి అడ్డాలు.

Hyderabad : ఫ్లైట్‌లో తిరుగుతూ.. ట్రాన్స్‌జెండర్స్ తో అడ్డాలు వేస్తోంది. ఆ తర్వాత నగరంలోని లక్జరీ హోటల్స్‌లో ఉంటూ మరోకరితో కలిసి దర్జాగా దొంగతనాలు చేస్తోంది.

    ఓ ట్రాన్స్‌జెండర్ ( robbery )రాత్రిపూట రోడ్లపై నిలబడి... లిఫ్టు అడుగుతుంది. రాత్రిపూట కదా అని లిఫ్టు ఇచ్చిన వారిని మాటలతో మాయ చేస్తోంది. మాటల్లో పెట్టి కాసేపటి తర్వాత వాళ్ల మీద ఉన్న బంగారం దోచుకువెళుతోంది. ఇలా వారంలో అయిదు రోజులు హైదరాబాద్‌లో ఉండడం, మిగతా రెండు రోజులు బెంగళూరు వెళ్లి మరో వ్యక్తితో గడపడం అలవాటైన ఓ జంటను నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

    వారి వద్ద నుండి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం ( robbery )చేసుకున్నారు. ( Police arrest )పోలీసుల కథనం ప్రకారం..కర్నాటక రాష్ట్రం, బెంగళూరు సిటి, బానశంకరికి చెందిన అంజుం అనే ట్రాన్స్‌జెండర్ కు ( transgender )బెంగళూరులో చిన్న వ్యాపారం చేసే.. బెంగళూర్‌లో చిన్న వ్యాపారం చేసే బసవరాజ్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి చనువుగా ఆ ఇద్దరు ఉంటున్నారు. కాగా గతంలో అంజూం నగరానికి వచ్చి దొంగతనాలు చేస్తూ ఉండేది. బసవరాజ్ స్నేహం కుదిరిన తర్వాత ఇద్దరు కలిసి దొపిడిలకు పాల్పడ్డారు. ఇలా హిజ్రా అజుం చైన్ స్నాచింగ్ చేస్తుండగా బసవరాజ్ వాటిని అమ్ముతుంటారు..ఇలా అజుం తరచూ నగరానికి వచ్చి ట్రాన్స్‌జెండర్లతో ఐదురోజులు ఉండి తిరిగి వెళ్లేది.

    ఇది చదవండి  : ఆయన కలెక్టరే అయినా.. పిల్లలు మాత్రం అంగన్‌వాడి స్కూళ్లో..


    సులభంగా డబ్బులు సంపాదించి, విలాసంగా బతుకాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. దీనికి అంజు లిఫ్ట్ పేరుతో వాహనాల్లోకి ఎక్కి వారితో చనువుగా ఉన్నట్లు నటించేది. ఇలా హిజ్రా వలకు చిక్కిన వారి బంగారు ఆభరణాలు చోరీ చేసేది. ఇక ఇది గమనించి ఎవరైనా దూరంగా పెడితే వారి మెడలోని బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయేది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ నగరానికి ఫ్లైట్‌లో వచ్చి సికింద్రాబాద్‌లోని వినాయక లాడ్జిలో ఉన్నారు. అదేరోజు రాత్రి అంజుం అనంద్ భవన్ వద్దకు చేరుకుంది. అటువైపు కారులో వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ ఇవ్వామని అడిగింది. కారులోకి వెళ్లిన తర్వాత కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు యజమాని మెడలోని బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయింది. అనంతరం బాధితుడు మహాకాంళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    ఇక అక్కడి నుంచి పారిపోయిన అంజుం పంజాగుట్ట రోడ్డు వైపు నిల్చుంది. అటునుంచి వస్తున్న కానిస్టేబుల్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైకి ఎక్కి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత మెడలోని బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయింది. వెంటనే కానిస్టేబుల్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో నిందితులను గుర్తించిన పోలీసులు ట్రాన్స్‌జండర్, మరో వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే లాడ్జికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు