ఆర్టీసీ బస్సులో తాగుబోతుల వీరంగం.. బస్సులోనే బీరు తాగుతూ బీభత్సం.. విసిగిపోయిన డ్రైవర్ ఏం చేశాడంటే..

రోడ్డు పక్కన నిలిపిన బస్సు

ఆర్టీసి(TSRTC) బస్సులో తాగుబోతులు వీరంగం సృష్టించారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తాండూరులో జరిగింది.

 • Share this:
  ఆర్టీసీ బస్సులో తాగుబోతులు వీరంగం సృష్టించారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో విసిగిపోయిన ఆర్టీసి డ్రైవర్, కండక్టర్ బస్సును నిలిపి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పోకిరీల ఆటకట్టించారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. గత రాత్రి మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ కు వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఐదుగురు యువకులు ఎక్కారు. అయితే వారు బస్సులోనే బీరు సీసాను తీసి తాగుతూ నానా హంగామా సృష్టించారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారు. వీరి చేష్టలతో విసిగిపోయిన ఆ బస్సు డ్రైవర్ బాలు, కండక్టర్ కిరణ్ బస్సును మార్గ మధ్యలో తాండురు వద్ద నిలిపి 100 నెంబర్ కు డయల్ చేశారు. దీంతో తాండూరు సీఐ పెట్రోలింగ్ సిబ్బంది తో కలిసి రంగంలోకి దిగి తమ లాఠీలకు పనిచెప్పారు. అనంతరం పోకిరీలను స్టేషన్ కు తరలించారు. ఈ ఐదుగురు ప్రయాణికులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

  ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో బైక్ నడిపి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు ఇద్దరూ యువకులు. శ్రీకాకుళానికి చెందిన గిరీష్‌ గుప్తా,రవితేజ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం ద్విచక్రవాహనంపై ఈ ఇద్దరూ స్నేహుతులు కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. అతివేగంతో వెళ్తున్న వీరి బైక్ అదుపుతప్పి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద ప్రమా దానికి గురయ్యారు.

  మీతి మీరిన వేగంతో ఉన్న బైక్ మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో పక్కన పడింది. ఈ క్రమంలో గిరీష్‌ గుప్తా తల రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు రవితేజకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రైలింగ్‌లో ఇరుక్కుపోయిన గుప్తాను బయటకు తీయడానికి గ్యాస్‌కట్టర్‌తో ఇనుప కడ్డీలను తొలగించారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published: