హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లిచూపులకు వెళ్లిన యువకుడు.. కట్నం కారణంగా సంబంధం కేన్సిల్.. అదే యువతితో హైదరాబాద్ కు ఎస్కేప్.. చివరకు..

పెళ్లిచూపులకు వెళ్లిన యువకుడు.. కట్నం కారణంగా సంబంధం కేన్సిల్.. అదే యువతితో హైదరాబాద్ కు ఎస్కేప్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లిచూపుల్లో అబ్బాయి, అమ్మాయి పరస్పరం ఇష్టపడ్డారు కానీ, కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో సంబంధం వద్దనుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. కానీ ఆ సమయంలోనే యువతీ యువకుడి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. చివరకు..

ఇంకా చదవండి ...

ఓ కుర్రాడు పెళ్లి చూపులకు వెళ్లాడు. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ కట్నం విషయంలోనే పెద్దల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ సంబంధం వద్దనుకుని వెళ్లిపోయారు. కానీ ఆ యువతీ, యువకుడు మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి, పెద్దలను ఎదురించి ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకుని ప్రేమను కంటిన్యూ చేశారు. ఒకానొక శుభముహూర్తం చూసుకుని ఇంట్లోంచి ఎస్కేప్ అయ్యారు. వీళ్ల వ్యవహారం తెలిసి ఇద్దరి కుటుంబ సభ్యులు వెతుకుతోంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకున్నామనీ, యువకుడితోనే ఉంటానని ఆమె తేల్చిచెప్పింది. అయితే వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక జరిగిన కిడ్నాప్ తతంగం కాస్తా ఎనిమిది మంది అరెస్టునకు దారి తీసింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం ఫక్కీర్ గూడకు చెందిన ఓ యువతికి, చౌటుప్పల్ మండలం లింగోజీగూడేనికి చెందిన ఆర్. సతీష్ కు కొన్ని నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ఇష్టపడ్డారు కానీ, కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో సంబంధం వద్దనుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. కానీ ఆ సమయంలోనే యువతీ యువకుడి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఫోన్లలో మాట్లాడుకున్నారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 30వ తారీఖున ఆ యువతి భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం సతీష్ కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో సతీష్ ఆ ఊరికి వెళ్లి ఆమెను తీసుకుని హైదరాబాద్ కు వచ్చేశాడు.

ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!

ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు రక్షణ కావాలని కోరారు. అప్పటికే యువతి మిస్సింగ్ పై భువనగిరిలో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు, పోలీసుల ఎదుట ‘నేను సతీష్ ను ప్రేమించాను. మేం ఇద్దరం మేజర్లం. నేను సతీష్ తోనే ఉంటాను. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. నా అంతట నేనే సతీష్ తో వచ్చేశాను’ అని చెప్పేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోలీసులు బయటకు పంపించేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

పోలీసులే ఆ ఇద్దరు వధూవరులను కారులో అబ్బాయి స్వగ్రామమైన లింగోజీగూడేనికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. ఈ విషయం కాస్తా అమ్మాయి బంధువులకు తెలిసింది. దీంతో మార్గమధ్యంలో నందనం గ్రామ శివారులో యువతి కుటుంబ సభ్యులు ఎనిమిది మంది కారును అడ్డగించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించి యువతిని తమ వెంట లాక్కెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాళ్లను వెంబడించి భువనగిరి మండలం వీరవెళ్లి శివారులో ఆ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇది కూడా చదవండి: కెనడాలో 27 ఏళ్ల తెలుగు కుర్రాడి ఆత్మహత్య వెనుక అసలు కారణమిదా..? ఇంటికి వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసి మరీ..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Nalgonda, Telangana

ఉత్తమ కథలు