POLICE ARRESTED A YOUTH FOR ALLEGEDLY DUPING MULTIPLE WOMEN BY POSING AS A DOCTOR OVER SOCIAL MEDIA SSR
OMG: ప్రభాస్ అని హీరో పేరు పెట్టుకున్నావ్.. కానీ నీ సంగతి తెలిస్తే ప్రభాస్ ఫ్యాన్సే కాదు..
ప్రభాస్ రాజ్ (ఫైల్ ఫొటో)
సమాజంలో కష్టపడి పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే వాళ్లు ఉన్నట్టే ఈజీ మనీ కోసం ఇతరులను మోసం చేస్తున్న వాళ్లూ మన మధ్య బతుకుతున్నారు. నేరం బయట పడేంత వరకూ ఆ వ్యక్తి నిజ స్వరూపం ఎవరికీ తెలియదు.
భువనేశ్వర్: సమాజంలో కష్టపడి పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే వాళ్లు ఉన్నట్టే ఈజీ మనీ కోసం ఇతరులను మోసం చేస్తున్న వాళ్లూ మన మధ్య బతుకుతున్నారు. నేరం బయట పడేంత వరకూ ఆ వ్యక్తి నిజ స్వరూపం ఎవరికీ తెలియదు. తెలిశాక విస్తుపోవడం తప్ప చేసేదేముంటుంది. కష్టపడే మనస్తత్వం లేని ఓ యువకుడు సోషల్ మీడియాను తన అవసరాలు తీర్చుకునే సాధనంగా వాడుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని వారితో శారీరక సుఖాన్ని అనుభవిస్తూ.. అందినకాడికి డబ్బు ఖర్చు పెట్టిస్తూ జల్సా చేస్తున్న ఓ యువకుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ యువకుడి పేరు ప్రభాస్ రాజ్. పేరు హీరోదే అయినప్పటికీ ఇతను చేసే పనులు తెలిస్తే ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. ఒడిశాలోని కటక్ సమీపంలోని బరంబా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఈ యువకుడు ఆరవ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ.. అతి తెలివితేటలు మాత్రం చాలానే ఉన్నాయి. కష్టపడే మనస్తత్వం లేనే లేదు. జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. జల్సాలు చేసేందుకు డబ్బు కోసం ప్రభాస్ సోషల్ మీడియాను వాడుకున్నాడు. ఫేస్బుక్లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో తనకు తాను బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్‌గా చెప్పుకొచ్చాడు. ఇతగాడు మోసగాడని తెలియక చాలా మంది అమ్మాయిలు, మహిళలు ట్రాప్‌లో పడ్డాడు. వాళ్లతో ప్రేమ పేరుతో కొన్నాళ్లు తిరగడం, మోజు తీరిపోయాక అందినకాడికి దండుకుని నంబర్ మార్చేయడం.. ఇదే ప్రభాస్ రూటు. ఇప్పటికే పలు కేసుల్లో రెండుమూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఈ ఫేక్ ప్రియుడికి సిగ్గు రాలేదు.
అతని చేతిలో మోసపోయిన ఓ యువతి ఇతని నిజ స్వరూపం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇతను ఇలాంటి కేసుల్లోనే జైలుకెళ్లి వచ్చినట్లు తెలిసింది. షాహిద్ నగర్ పోలీసులు ఇతని మోసాలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
డాక్టర్ అని వాళ్లను నమ్మించడం కోసం ఆ హాస్పిటల్ వార్డుల్లో కూడా తిరిగే వాడని, అక్కడికి వెళ్లి నమ్మిన అమ్మాయిలకు వీడియో కాల్ చేసేవాడని తెలిసింది. పూర్తిగా నమ్మారని భావించిన తర్వాత ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దామనే ప్రతిపాదన తీసుకొచ్చేవాడని.. అలా కలిసిన అమ్మాయిలను శారీరకంగా అనుభవించడం.. షాపింగ్‌ల పేరుతో నచ్చిన బట్టలు, గ్యాడ్జెట్స్ కొనిపించుకోవడం చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇతని వలలో పడి కొందరు వివాహితలు కూడా మోసపోయినట్లు తెలిసింది. దాదాపు 15 మంది మహిళలకు పైగా ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు తేల్చారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.