POLICE ARRESTED A MAN WHO RAPED EIGHT YEARS OLD GIRL IN KARNATAKA FULL DETAILS HERE HSN
ఎనిమిదేళ్ల బాలికను పొదల్లోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం.. ఆపై ఐదు రూపాయలు చేతిలో పెట్టి..
ప్రతీకాత్మక చిత్రం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ అయోధ్య నగర్ కు చెందిన 8ఏళ్ల బాలిక శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. కాస్త దూరంలో ఉన్న దుకాణానికి వెళ్లి వంద రూపాయలను ఇచ్చి పొగాకు పొట్లాలను తీసుకురమ్మని చెప్పాడు.
చిన్న పిల్లలకు డబ్బులు ఇచ్చి దుకాణాల్లో ఏదైనా వస్తువులను తెప్పించుకోవడం ఊళ్లో సాధారణంగా జరిగేదే. ఆ వస్తువును తెచ్చిన తర్వాత తమకు ఒక రూపాయో, రెండ్రూపాయలో ఇస్తారని పిల్లలు ఆశిస్తుంటారు. పెద్దలు కూడా వస్తువును కొనుక్కురమ్మన్నప్పుడే ‘నువ్వు కూడా ఓ రూపాయి ఏదైనా కొనుక్కో‘ అంటూ చెబుతుంటారు కూడా. అందుకే పిల్లలు ఎవరు ఎలాంటి వస్తువులు తెమ్మన్నా సరే నో చెప్పకుండా దుకాణాలకు వెళ్లి మరీ తెస్తుంటారు. అయితే ఓ దుర్మార్గుడు పిల్లల ఆ బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు. ఓ ఎనిమిదేళ్ల పాపకు డబ్బులిచ్చి పొగాకు పొట్లాలు తెప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను మాటల్లో పెట్టి చెత్తకుప్పల్లోకి తీసుకెళ్లాడు. నోరుమూసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై ఐదు రూపాయలు ఇచ్చి మరీ ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కానీ అతడు చేసిన నిర్వాకం బట్టబయలై ఇప్పుడు కటకటాలను లెక్కిస్తున్నాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ అయోధ్య నగర్ కు చెందిన 8ఏళ్ల బాలిక శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. అయితే ఆ బాలిక వద్దకు నేరుగా ఓ వ్యక్తి వచ్చాడు. ఆమెకు ఓ వంద రూపాయలు ఇచ్చాడు. కాస్త దూరంలో ఉన్న దుకాణానికి వెళ్లి వంద రూపాయలను ఇచ్చి పొగాకు పొట్లాలను తీసుకురమ్మని చెప్పాడు. ఆ బాలిక కూడా అదే పనిచేసింది. పొగాకు పొట్లాలు తీసుకొచ్చి అతడికి ఇవ్వబోతే.. ‘నాకు కాదు, కాస్త దూరంలో మరో వ్యక్తి ఉన్నాడు. అతడికి ఇవ్వు‘ అని చెప్పాడు. ఆమె అతడు చెప్పిన దిశగా వెళ్తోంటే, ఆ పాప వెంటే నడుస్తూ వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమెను చెత్తకుప్పల్లోకి లాక్కెళ్లాడు. నోరు మూసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెకు ఐదు రూపాయలు ఇచ్చి, విషయం ఎవరికీ చెప్పొద్దనీ, చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఆ పాప ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. ఆ పాప తల్లి ఏంటని అడిగితే.. తెలిసీ తెలియని మాటలతో జరిగింది చెప్పింది. దీంతో వెంటనే ఆ బాలికను తీసుకుని అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. విషయం చెప్పి కేసు నమోదు చేసుకుంది. పాపకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. అతడెవరన్నది పాపను అడిగారు. అయితే గతంలో అతడిని తాను చూడలేదనీ, రెండుసార్లు మాత్రమే చూశానని చెప్పడంతో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. చివరకు ఆ ప్రాంతంలో ఆ రోజు తిరిగిన 40 మంది పొటోలను చూపించగా, రవి అనే 30 ఏళ్ల వ్యక్తిని గుర్తించింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతడికి గతంలోనే పెళ్లయిందనీ, కుటుంబ కలహాల వల్ల విడిగా ఉంటున్నారని విచారణలో తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.