POLICE ARRESTED A 59 YEAR OLD MAN IN CONNECTION WITH THE ACID ATTACK ON A 32 YEAR OLD WOMAN IN COIMBATORE SSR
59 Year Old Man: ఏంటిది పెద్దాయనా.. అల్లుడు అఫైర్ పెట్టుకున్నాడనే డౌట్‌తో ఏ మామా చేయని పని చేశావ్..
నిందితుడు
వివాహేతర సంబంధాలు ఎంత చేటని తెలిసినా క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ కొందరు తమ కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చివరకు అఫైర్ మోజులో నేరాలకు పాల్పడుతూ వాళ్లు ఏడుస్తుందే కాకుండా ఎంతోమంది ఏడుపునకు కారణమవుతున్నారు.
కోయంబత్తూర్: వివాహేతర సంబంధాలు ఎంత చేటని తెలిసినా క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ కొందరు తమ కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చివరకు అఫైర్ మోజులో నేరాలకు పాల్పడుతూ వాళ్లు ఏడుస్తుందే కాకుండా ఎంతోమంది ఏడుపునకు కారణమవుతున్నారు. తాజాగా కోయంబత్తూరులో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో గత గురువారం రాత్రి నగరంలోని అమ్మన్కుళం ప్రాంతంలో 32 ఏళ్ల మహిళపై ఓ గుర్తు తెలియని వృద్ధుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనకు బాధ్యుడైన 59 ఏళ్ల వృద్ధుడైన ఎస్.ఇళంగొవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఎందుకు ఆమెపై యాసిడ్ దాడి చేశావని నిందితుడు పోలీసులు విచారించగా షాకింగ్ విషయాన్ని ఇళంగొవన్ బయటపెట్టాడు. యాసిడ్ దాడిలో గాయపడిన రాధ భర్త పేరు స్టాలిన్ (40). తమిళనాడులోని ధర్మపురి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇళంగొవన్ అల్లుడి పేరు ఎం.చంద్రశేఖర్(40). వళ్లార్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్టాలిన్, చంద్రశేఖర్ గత ఎనిమిదేళ్లుగా ఒకే కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్నారు. స్టాలిన్, చంద్రశేఖర్ స్నేహంగా ఉండేవారు. స్టాలిన్ ఇంటికి కూడా చంద్రశేఖర్ వెళుతుండేవాడు. స్టాలిన్ భార్య రాధతో కూడా చంద్రశేఖర్‌కు పరిచయం ఉంది.
స్టాలిన్, అతని భార్య రాధకు మధ్య కొన్ని నెలల క్రితం విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఉండటం లేదు. రాధ కోయంబత్తూరులోని అమ్మన్ పూల్ ప్రాంతంలో గత 8 నెలలుగా ఒక్కతే నివాసం ఉంటోంది. ఆమె కూడా కన్స్ట్రక్షన్ పనిలోకి వెళుతోంది. అదే సమయంలో.. చంద్రశేఖర్ తన కుటుంబాన్ని సక్రమంగా చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. దీంతో.. స్టాలిన్ భార్య రాధతో చంద్రశేఖర్ వివాహేతర సంబంధం పెట్టుకుని తన కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని ఇళంగొవన్ భావించాడు.
తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రాధపై కక్ష పెంచుకున్నాడు. కూతురి జీవితం బాగుండాలంటే తన అల్లుడికి రాధ దూరంగా ఉండాలని భావించాడు. అలా ఉండాలంటే ఆమెపై యాసిడ్ పోసి బెదిరించాలని నిర్ణయించుకుని చివరకు అనుకున్న పని చేశాడు. రోడ్డుపై వెళుతున్న ఆమెపై యాసిడ్ పోసి.. తన అల్లుడికి దూరంగా ఉండకపోతే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. యాసిడ్ దాడిలో గాయపడిన రాధను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఇళంగొవన్ను కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కూతురి జీవితం బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు గానీ అందు కోసం మరో మహిళపై యాసిడ్ దాడి చేయాలన్న క్రూరమైన ఆలోచనే ఆ కన్నతండ్రిని నేరస్తుడిగా నిలబెట్టింది. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.