news18-telugu
Updated: November 15, 2020, 4:24 PM IST
మీడియాతో మాట్లాడుతున్న పోలీసులు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువైన 13 తులాల బంగారం రికవరీ చేశారు. ముగ్గురు నిందితులను కోస్గి మండలం గుండుమల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయాలను మహబూబ్‌నగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేశ్, ఎస్ఐ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ముగ్గరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకోవడం వీరిని పెడదారి పట్టేలా చేసిందని చెప్పారు. నిందితులను జి ఉదయ్‌కుమార్, కె విశాల్ కుమార్, గొల్ల గోపాల్‌గా గుర్తించామని పేర్కొన్నారు.
నిందితుల్లో కె విశాల్ కుమార్ స్వస్థలం గుండుమల్ గ్రామం. ఇతనికి తల్లి దండ్రులు ఉన్నారు. ఇతడు హోటల్ మేనేజ్మెంట్ చదివినాడు. COVID-19 కంటే ముందు హైదరాబాద్‌లో THE CHEF HOTEL లో పని చేసేవాడు. COVID వలన ఉద్యోగం పోయినందున స్వగ్రామానికి వచ్చాడు. అప్పటికే ఉదయ కుమార్ తో ఇతనికి స్నేహం ఉన్నది. ఉదయ్‌కుమార్‌ది కూడా అదే గ్రామం.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం
మరో నిందితుడు గొల్లగోపాల్ కూడా గుండుమల్ గ్రామానికి చెందినవాడే. ఇతడు ప్రధానంగా వ్యవసాయం చేస్తుంటాడు. ఇతనికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉన్నది. అందులో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఉదయ్, విశాల్‌తో ఇతనికి స్నేహం ఉన్నది. పోగొట్టుకున్న డబ్బులు ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ముగ్గురు జట్టుగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డాడు
Published by:
Sumanth Kanukula
First published:
November 15, 2020, 4:24 PM IST