హోమ్ /వార్తలు /క్రైమ్ /

రాత్రిపూట దెయ్యాల్లా.. రోడ్లపై జనాలను బెంబేలెత్తించిన యువకులు

రాత్రిపూట దెయ్యాల్లా.. రోడ్లపై జనాలను బెంబేలెత్తించిన యువకులు

యశ్వంత్‌పూర్‌ రోడ్లపై దెయ్యాల గెటప్‌లో యువకుల ప్రాంక్ వీడియో

యశ్వంత్‌పూర్‌ రోడ్లపై దెయ్యాల గెటప్‌లో యువకుల ప్రాంక్ వీడియో

యశ్వంత్‌పూర్‌లోని షరీఫ్ నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఆటోరిక్షాలు,కార్లు,బైక్స్‌ను ఆపి వారిని భయపెట్టారని.. దాంతో సదరు ప్రయాణికులు భయపడి వెనక్కి పారిపోయారని పోలీసులు తెలిపారు.

యూట్యూబ్‌ ప్రాంక్ వీడియోల పేరుతో రోడ్లపై పడి పిచ్చి వేషాలు వేయడం కొంతమందికి అలవాటైపోయింది.తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రాంక్ వీడియోలతో ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న ఏడుగురు యువకులు.. దెయ్యం వేషాలతో ప్రాంక్ వీడియో రూపొందించాలనుకున్నారు.అనుకున్నట్టుగానే దెయ్యాల గెటప్ వేసుకుని రాత్రిపూట రోడ్ల పైకి వచ్చారు.రోడ్లపై వెళ్లేవారిని, ఫుట్‌పాత్‌లపై పడుకున్నవారిని భయపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.


యశ్వంత్‌పూర్‌లోని షరీఫ్ నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఆటోరిక్షాలు,కార్లు,బైక్స్‌ను ఆపి వారిని భయపెట్టారని.. దాంతో సదరు ప్రయాణికులు భయపడి వెనక్కి పారిపోయారని పోలీసులు తెలిపారు. యూట్యూబ్ చానెల్ కోసమే ఇదంతా చేశామని నిందితులు చెప్పినట్టు తెలిపారు. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. దాన్ని ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టయిన ఏడుగురిలో అంతా 18-25 ఏళ్ల లోపు వారేనని తెలిపారు. ఆన్‌లైన్‌లో దెయ్యాల

వీడియోలు చూసి.. తాము కూడా అలాంటి ప్రాంక్ చేయాలని ఇదంతా చేశారని చెప్పుకొచ్చారు.


First published:

Tags: Prank videos, Youtube

ఉత్తమ కథలు