• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • POLICE ARREST PEDDAPALLI ZP CHAIRMAN PUTTA MADHU IN BHIMAVARAM SU

Putta Madhu: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్.. వారం రోజుల తర్వాత వీడిన మిస్టరీ..

Putta Madhu: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్.. వారం రోజుల తర్వాత వీడిన మిస్టరీ..

పుట్ట మధు(ఫైల్ ఫొటో)

పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎక్కడున్నాడనే అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఈటలకు సన్నిహితుడిగా పేరున్న మధు అజ్ఞాతంలోకి వెళ్లడం రకరకాలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈటలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన నాటి నుంచే మధు కనిపించకుండా వెళ్లడం మిస్టరీగా మారింది. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో.. ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో నెలకొంది. అయితే తాజాగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మధును ఏ కేసులో అరెస్ట్ చేశారనే విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించలేదు.

    ఇక, కొన్ని నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు అతని అనుచరులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మంథని కోర్టు ఆదేశాల మేరకు పుట్ట మధు భార్య పుట్ట శైలజపై కూడా కేసు నమోదైంది. న్యాయవాద దంపతులు వామన్‌రావు-నాగమణి దంపతుల హత్య కేసు విచారణ సందర్భంగా... నిందితుడు బిట్టు శ్రీనుతో కోర్టు ఆవరణలో ఆమె వీడియో కాల్ మాట్లాడించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా మంథని నియోజర్గంలో జరుగుతోంది. అయితే పుట్ట మధును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనే విషయంపై పోలీసు అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

    మరోవైపు పుట్ట మధు అజ్ఞాతంపై శుక్రవారం ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశారని శైలజ వివరించారు. తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం నిజం లేదని చెప్పారు. అయితే ఆమె వివరణ ఇచ్చిన మరుసటి రోజే పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు