సైకోలా మారిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్థి... ఆ యువతి వెంటపడి...

25 ఏళ్ల ఆ యువతిని వెంటాడి, ఏడిపిస్తున్న MPSC స్టూడెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనతో తప్ప... ఇతరులతో స్నేహం చెయ్యవద్దంటూ... ఆమెకు నరకం చూపించాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 12:31 PM IST
సైకోలా మారిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్థి... ఆ యువతి వెంటపడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతని పేరు వినాయక్ వాఘ్ (27). మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) విద్యార్థి. అంత గొప్ప చదువు చదువుతున్నా బుద్ధి మాత్రం లేదు. 25 ఏళ్ల యువతిని వేధించాడు. బాధితురాలు కూడా MPSC విద్యార్థినే. ఇద్దరూ ఒకే కోచింగ్ క్లాస్‌కి వెళ్లేవాళ్లు. ఇద్దరూ ఒకే లైబ్రరీలో చదువుకునేవాళ్లు. ఆమె ఎప్పుడూ అతనితో డైరెక్టుగా మాట్లాడింది లేదు. కనీసం ఫోన్లలో సరదా చాటింగ్ కూడా లేదు. అయినప్పటికీ... ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను చూస్తే చాలు... తన మాటే వినాలన్నట్లు బిహేవ్ చేసేవాడు. ఈ విషయాలన్నీ పోలీసులకు చెప్పి ఏడ్చేసింది బాధితురాలు. రెండ్రోజుల కిందట... విశ్రామ్‌భాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం వినాయక్ వాఘ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వినాయక్... పుణెలోని నారాయణ్ పేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఏడాది కిందట... ఆమెతో తొలిసారి ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో మొబైల్ చాట్ చేశాడు. కానీ ఆమె ఎప్పుడూ అతన్ని డైరెక్టుగా కలవలేదు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. క్రమంగా అతనిలో సైకో బయటికొచ్చాడు. ఆమె ఎవరైనా ఇతర అమ్మాయిలు, అబ్బాయిలతో మాట్లాడితే చాలు... ఫోన్ చేసి... వాళ్లూ, వీళ్లను కలవవద్దు, మంచివాళ్లు కాదు అనేవాడు. మీకెలా తెలుసు అంటే... చెప్తున్నాను కదా... నా మాట వినండి అనేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక... వాయిస్ పెంచాడు. అబ్బాయిలెవరితోనూ మీరు ఫ్రెండ్షిప్ చెయ్యవద్దు అనేవాడు. ఎందుకంటే... అది నాకు ఇష్టం లేదు అన్నాడు. మీకు ఇష్టం లేకపోతే, నాకేంటి... నా ఫ్రెండ్స్ నా ఇష్టం అంది. అలా ఎలా కుదురుతుంది... నేను చెబుతున్నాగా... వద్దని... వాళ్లతో మాట్లాడొద్దు అని బెదిరించాడు. చిరాకొచ్చిన ఆమె... అతని నంబర్‌ను బ్లాక్ చేసింది.

ఇక అప్పటి నుంచీ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెతో డైరెక్టుగా మాట్లాడేందుకు వెనకాలే ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అతని తీరుపై భయం వేసిన బాధితురాలు... పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు... అంత తీవ్రత ఏమీ లేదులే అని కేసు లైట్ తీసుకున్నారు. కేసు నమోదైన కొన్ని గంటల తర్వాత... ఆమెతో మాట్లాడుతున్న బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి... అతన్ని చంపేస్తానని బెదిరించాడు. ఇకపై ఆమెతో మాట్లాడవద్దన్ని వార్నింగ్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచీ... వినాయక్‌కి కనిపించకుండా తిరగసాగింది బాధితురాలు. అయినప్పటికీ వదలని వినాయక్... ఆమె ఫ్రెండ్స్ ద్వారా ఆమె ఎక్కడున్నదీ ఆరా తీస్తున్నట్లు తెలియడంతో... మరోసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఈసారి సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఐపీసీ సెక్షన్ 354 (మహిళ స్వేచ్ఛకు భంగం, బలవంతం చెయ్యడం), సెక్షన్ 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతికి భంగం కలిగించడం), సెక్షన్ 506 (నేరపూరిత ఉద్దేశం) కింద కేసు రాసి... వినాయక్‌ను అరెస్టు చేశారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు