హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆస్పత్రికి వచ్చిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారు.. అసలేం జరిగిందంటే..

ఆస్పత్రికి వచ్చిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారు.. అసలేం జరిగిందంటే..

Image Credit- News directory

Image Credit- News directory

ఓ వ్యక్తి తన భాగస్వామికి ప్రైవేట్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చాడు. అయితే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకోసమంటే..

ఓ వ్యక్తి తన భాగస్వామికి ప్రైవేట్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చాడు. అయితే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతనిపై డ్రగ్స్ కేసుతో పాటు 40కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అతను ఓ పెద్ద గుండా అని డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కేరళలో(Kerala) చోటుచేసుకుంది. వివరాలు.. గతేడాది డిసెంబర్‌లో పోలీసులు నిమ్మి అనే మహిళ తన ఇంట్లో దాచి ఉంచిన 29 కిలో గంజాను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. మావెలిక్కర(Mavelikkara) జిల్లా ఆస్పత్రికి సమీపంలోని అద్దె ఇంట్లో ఆమె నివాసం ఉంటుంది. అయితే పోలీసులు వారికి అందిన సమాచారంతో ఆమె ఉంటున్న ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ సమయంలో గంజాతో పాటు భారీగా మద్యాన్ని కూడా పోలీసులు ఆమె ఉంటున్న ఇంట్లో గుర్తించారు. ఆ రోజే ఆమెను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా కోసం వినియోగిస్తున్న కారును, నిమ్మి స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు క్రిమినల్ లిజు ఊమెన్‌పై కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ సరఫరాలో లిజు కీలకంగా వ్యవహరించాడు. నిమ్మికి వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. అయితే కుటుంబ విభేదాల నేపథ్యంలో నిమ్మి(Nimmi).. తన భర్తకు దూరంగా ఉండసాగింది. అయితే ఆమె ఇంటికి లీజు తరచూ వచ్చేవాడు. దీంతో స్థానికులు వారిద్దరు భార్యభర్తలు అని భావించాడు. అయితే లీజు తనతో తీసుకొచ్చిన డ్రగ్స్‌ను.. నిమ్మి ఇంట్లో, స్కూటర్‌లో దాచేవాడు. తన స్మగ్లింగ్ సాఫీగా సాగేందుకు నిమ్మిని, ఆమె పిల్లలను అడ్డం పెట్టుకునేవాడు. ఖరీదైన కార్లను డ్రగ్స్ స్మగ్లింగ్‌కు వాడేవాడు. అయితే నిమ్మి పిల్లలను బంధువులకు అప్పగించారు. ఆమెను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

Sad: పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు.. సీసీటీవీలో దృశ్యాలు.. అసలేం జరిగిందంటే..


ఈ కేసుతో పాటు, 40కి పైగా కేసులు లీజుపై నమోదు అయినట్టుగా పోలీసులు తెలిపారు. మావెలిక్కర ఎస్‌ఐ హత్యాయత్నం కేసులో కూడా లీజు.. నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే లీజును పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తన భాగస్వామి నిమ్మితో ఐవీఎఫ్ చికిత్స కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. చాలా కాలంగా పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న లీజును పట్టుకోవడానికి లుక్ జౌట్ నోటీసులు జారీచేశారు. ఆస్పత్రికి వచ్చే లీజును పట్టుకోవాలని భావించారు. దీంతో ప్లాన్ చేసిన పోలీసులు కొచ్చిలో లీజు ఊమెన్‌ను అరెస్ట్ చేశారు. కొద్ది నెలల పాటు అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Crime news, Drugs, Kerala

ఉత్తమ కథలు