క్రైమ్

  • associate partner

IPL Betting: బంతి బంతికీ బెట్టింగ్.. వేయికి పదివేలు.. పదివేలకు లక్ష.. ఈ దందా ఎక్కడంటే..

వందకు వేయి, వేయికి పదివేలు, పదివేలకు లక్ష ఇలా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐపీఎల్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. టాస్ చేసింది మొదలు ప్రతీ బంతికి, ప్రతీ ఓవర్ కు బెట్టింగ్ కడుతున్నారు.

news18-telugu
Updated: November 3, 2020, 12:03 PM IST
IPL Betting: బంతి బంతికీ బెట్టింగ్.. వేయికి పదివేలు.. పదివేలకు లక్ష.. ఈ దందా ఎక్కడంటే..
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు
  • Share this:
వందకు వేయి.. వేయికి పదివేలు.. పదివేలకు లక్ష.. ఈ తీరుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐపీఎల్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి బెట్టింగ్, బ్యాట్స్ మెన్ బౌండరీ కొడుతాడా బౌలర్ వికెట్ తీస్తాడా? ఫలానా ఓవర్ లో ఎన్ని పరుగులు ఇస్తాడు? బ్యాట్సమెన్ ఎలా అవుట్ అవుతాడు. టాస్ వేసినప్పటి నుంచి చివరి వరకు బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. కరీంనగర్ చుట్టు పక్కన మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అక్రమ బెట్టింగ్ దందాను సాగిస్తున్నారు. గతంలో గెలుపోటములపై మాత్రమే బెట్టింగ్ కట్టేవారు. అయితే ప్రస్తుతం టాస్ చేసింది మొదలు ప్రతీ బంతికి, ప్రతీ ఓవర్ కు బెట్టింగ్ కడుతున్నారు. ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 18న ప్రారంభం అయ్యింది. నవంబర్ 10 తేదీ వరకు ఐపీఎల్ కొనసాగనుంది. అయితే ఐపీఎల్ కు ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ఈ బెట్టింగ్ లు జోరందుకున్నాయి. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ కు వెళ్లేది ఎవరంటూ వారం ముందు నుంచే బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. దీంతో అనేక మంది డబ్బులు పోగొట్టుకుని అప్పుల్లో మునిగిపోతున్నారు.

దీంతో అనేక పేద కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఐపీఎల్ రాకతో సాయంత్రమయిందంటే చాలు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ వ్యవహారంలో బెట్టింగుల్లో పాల్గొన్న వారు నష్టపోతుండగా నిర్వాహకులు 10 నుంచి 20శాతం కమిషన్ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని తెలుస్తోంది. ఈసారి బెట్టింగ్ కు వాట్సాప్, ఇతర యాప్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వాహకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. గతంలో కేవలం మహానగారాలకే పరిమితమైన ఈ పరిజ్ఞానాన్ని నిర్వాహకులు ఇక్కడ వాడుకుంటున్నారు. ప్రధానంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగుల్లో సరికొత్త సాంకేతికను వినియోగిస్తున్నారు.

బెట్టింగ్ పై పోలీసుల నజర్..
అయితే ఈ ఐపీఎల్ బెట్టింగ్ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు ప్రత్యేక నిఘాపెట్టి నిన్న సాయంత్రం పక్కా సమాచారంతో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి లక్షల రూపాయలు నగదు, 8సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ నగర్ జిల్లా కేంద్రం, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సద్దాం, వేణుగోపాల్, రఫిక్, జహంగీర్, శ్రావణ్, రాజ్ కుమార్, రమేష్, కన్నాల రాజు అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరంతా కరీంనగర్, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు కావడం గమనార్హం. బెట్టింగ్ నిర్వహించిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 3, 2020, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading