ఢిల్లీ(Delhi)లో గణతంత్ర దినోత్సవం (Republic Day)రోజున ఓ అమానుష ఘటన జరగడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ మహిళను కిడ్నాప్ (Kidnap)చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా ఆమెపై సామూహిక అత్యాచారాని(Gang rape)కి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో తోటి మహిళలే నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.సోషల్ మీడియాలో ఈఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Video viral)అవుతోంది. వివేక్ విహార్(Vivek vihar)కి చెందిన ఓ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని తీసుకెళ్లారు. అటుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈకేసులో బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని నలుగురు మహిళ(Four Womens)లే కిడ్నాప్ చేయించి ఆమెపై అత్యాచారం చేయించారని తేలింది. అంతే కాదు అనంతరం బాధితురాలి జుట్టు కత్తిరించి మెడలో చెప్పుల దండలు వేసి ఆమెను కొడుతూ ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని నలుగురు ఆడవాళ్లను అరెస్ట్ చేశారు. కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు బాధితురాలి వ్యక్తిగత శత్రువులో ఈదారుణానికి పాల్పడినట్లుగా రాబట్టారు.
ఈకిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసు వెనుక
నడిరోడ్డుపై మహిళకు అవమానం..
అత్యాచారానికి గురైన మహిళకు వివాహమైంది. ఓ బిడ్డ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం బాధిత మహిళ వెంట ఓ యువకుడు తిరిగేవాడని..అతను గతేడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చావుకు కారణాలు ఏమైనప్పటికి బాధితురాలి వల్లే ప్రాణాలు తీసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులు భావించారు. అప్పటి నుంచి బాధిత మహిళపై శత్రుత్వం పెంచుకున్నారు. ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. గణతంత్రదినోత్సవం రోజు కిడ్నాప్ చేసి అటుపై అత్యాచారం చేయించిన తర్వాత ఆమెను తీవ్రంగా అవమానించారు. నడిరోడ్డుపై మెడలో చెప్పుల దండ వేసి ముఖంపై కొడుతూ ఊరేగించారు. విషయం బాధితురాలి సోదరి ద్వారా తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని ఆమెను కాపాడారు. దాడి చేసిన మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు.
కిడ్నాప్, గ్యాంగ్‌రేప్‌కి గురైన బాధితురాలిని నిందితులు నడిరోడ్డుపై తీవ్రంగా అవమానించినట్లుగా పోలీసులు రాబట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఈఘటనలో మరికొందర్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వ్యక్తిగత శత్రుత్వంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi police, Gang rape, Viral Video