హోమ్ /వార్తలు /క్రైమ్ /

Online Class: ఆన్‌లైన్ క్లాసులో విద్యార్థి నగ్న ప్రదర్శన.. కెమెరా ముందు బట్టలు తీసేసి..

Online Class: ఆన్‌లైన్ క్లాసులో విద్యార్థి నగ్న ప్రదర్శన.. కెమెరా ముందు బట్టలు తీసేసి..

7. పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా విద్యార్థులపై ఈ ప్రభావం పడుతోందని యునిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించేందుకు ఇండియన్ టీచర్లు కూడా కృషి చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల సేఫ్టీపై శ్రద్ధ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

7. పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా విద్యార్థులపై ఈ ప్రభావం పడుతోందని యునిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించేందుకు ఇండియన్ టీచర్లు కూడా కృషి చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల సేఫ్టీపై శ్రద్ధ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

కరోనా కారణంగా చాలా వరకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే ఆన్‌లైన్ క్లాసుల సందర్భంగా కొన్ని చోట్ల వికృత చేష్టలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

కరోనా కారణంగా చాలా వరకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే ఆన్‌లైన్ క్లాసుల సందర్భంగా కొన్ని చోట్ల వికృత చేష్టలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థి అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. ఫ్రెండ్ నుంచి ఆన్‌లైన్ క్లాస్ లింక్ పొందిన విద్యార్థి.. నకిలీ మెయిల్ ఐడీతో లింక్‌‌కు కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతని నెంబర్ రాగానే తన బట్టలు తీసేసి కెమెరా ముందు నిల్చున్నాడు. దీంతో తీవ్ర గందగోళం నెలకొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఆ కాలేజ్ యజమాన్యం సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. తమ ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన లింక్‌ను ఎవరో పొందారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థి పేరిట నకిలీ ఐడీని సృష్టించి.. ఆన్‌లైన్ క్లాస్ ప్రారంభమైనప్పుడు.. నిందితుడు కెమెరా ముందు నగ్నంగా నిల్చున్నాడని తెలిపింది. ఇది మిగత విద్యార్థుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసిందని వివరించింది.

దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏవరి పేరుతో నిందితుడు ఆన్‌లైన్ క్లాస్‌లోకి ప్రవేశించాడో పోలీసులు అతడిని గుర్తించారు. అయితే అతడు తనకేమి తెలియదని చెప్పాడు. అతడు ఆ రోజు ఆన్‌లైన్ క్లాస్ లింక్‌లో చేరలేపోయినట్టుగా తెలిపాడు. దీంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు శివపురికి చెందిన 12వ తరగతి విద్యార్థి సోను(పేరు మార్చబడింది) వద్దకు చేరుకున్నారు. అక్కడ అసలు విషయం మొత్తం బయటపడింది.

కాలేజ్ ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి లింక్ పొందడం ద్వారా.. అతడు నకిలీ పేరుతో అతడు అందులోకి చేరాడు. తన వంతు రాగానే బట్టలు తీసేసి నీచంగా ప్రవర్తించాడు. అయితే నిందితుడు.. అదే కాలేజ్‌లో తన స్నేహితుడు టింకు(పేరు మార్చడం జరిగింది) నుంచి ఈ లింక్ పొందాడు. టింకు, సోనులు కలిసి పబ్ జీ గేమ్ ఆడేవారు. ఈ పరిచయంతోనే సొను.. టింకు నుంచి ఆన్‌లైన్ క్లాసు లింక్ పొందాడు. టింకు.. స్నేహితులలో ఒకరి పేరు ద్వారా నిందితుడు ఫేక్ మెయిల్ ఐడీ సృష్టించి ఆన్‌లైన్ క్లాస్‌లో చేరాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడు సోనుతో పాటు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశాడు.

First published:

Tags: Crime news, Madhya pradesh, Online classes

ఉత్తమ కథలు