వాలెంటైన్స్ డే ఎఫెక్ట్... భజరంగ్‌దళ్ కార్యకర్తలు అరెస్టు

Valentines Day 2020 : వాలెంటైన్స్ డే వేడుకల్ని అడ్డుకుంటామన్న భజరంగ్ దళ్ కార్యకర్తలు... అన్నంతపనీ చెయ్యడంతో... పోలీసులు అరెస్టు చేశారు.

news18-telugu
Updated: February 15, 2020, 1:47 PM IST
వాలెంటైన్స్ డే ఎఫెక్ట్... భజరంగ్‌దళ్ కార్యకర్తలు అరెస్టు
వాలెంటైన్స్ డే ఎఫెక్ట్... భజరంగ్‌దళ్ కార్యకర్తలు అరెస్టు
  • Share this:
Valentines Day 2020 : వాలెంటైన్స్ డే సందర్భంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులకు దిగడంతో... అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు రాసి అరెస్టు చేశారు. వాలంటైన్స్ డే‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ కేక్ షాపులో వాలంటైన్స్ డే కోసం ప్రత్యేకంగా స్వీట్లు, కేక్‌లు తయారుచేస్తున్న విషయం తెలుసుకుని ఆ దుకాణం మీద దాడి చేశారు. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టారు. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. మీడియా, సోషల్ మీడియాలో కూడా వీడియోల్ని పరిశీలించిన హైదరాబాద్... మాదాపూర్ పోలీసులు... సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి 8 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలను అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తిడుతూ, తమ వారిపై పోలీసులు చేయి చేసుకున్నారంటూ స్టేషన్ ముందు ధర్నా చేశారు మరికొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు.First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు