సోషల్ మీడియా వేదికగా లైంగిక వేధింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా 12 ఏళ్ల బాలికను ఇన్స్టాగ్రామ్ వేదికగా వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా పాల్ధాకు చెందిన సందీప్‌గా(27) గుర్తించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన సందీప్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.
కేసు వివరాలు.. కాలిఫొర్నియాకు చెందిన బాలికకు సందీప్ ఇన్‌స్టాలో కాలిఫొర్నియాలో ఉంటున్న బాలికకు ఈ ఏడాది మార్చిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అయితే అతను కామన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉండటంతో ఆ బాలిక ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఇక, ఆ తర్వాత బాలికతో పరిచయం పెంచుకున్న సందీప్.. కొన్ని రోజులు తర్వాత ఫొటోలు పంపి వేదింపులకు గురిచేశాడు. ఆమె నగ్న చిత్రాలు పంపాల్సిందిగా బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పొక్సోతో ఇతర సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.
ఇక, ఈ కేసును చేధించడంలో కీలకంగా వ్యహరించిన అధికారుల బృందాన్ని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అభినందించారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే పర్సనల్ ఫొటోలు, వీడియోలను గుర్తు తెలియని వ్యక్తులకు పంపకూడదని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రలు కూడా తమ పిల్లలు మొబైల్, సోషల్ మీడియా వాడకంపై పర్యవేక్షణ ఉంచాలని కోరారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.