news18-telugu
Updated: October 9, 2020, 7:14 AM IST
కేబుల్ బ్రిడ్జిపై అల్లరి మూకలు(Photo-Twitter)
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాత్రి సమయంలో అల్లరి పనులు చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు మధ్యలో ఉండి న్యూసెన్స్ చేస్తున్న యువకులను అటుగా వచ్చిన పెట్రోలింగ్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫొటోలకు ఫోజులు ఇస్తూ రోడ్డు మధ్యలో పడుకున్నాడు. ఒంటి మీద షర్ట్ లేకుండా.. కేవలం షార్ట్‌పై ఉండి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. మరోవైపు కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముందు నుంచే టూరిస్ట్ స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యల్లో సందర్శకులు వస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం దాటాక విద్యుత్ కాంతుల్లో కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే కొందరు మాత్రం సెల్ఫీల కోసం బ్రిడ్జిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు పోకిరీలు బ్రిడ్జిపై వెళ్తున్న వాహనాల రాకపోకలను కూడా పట్టించుకోకుండా రోడ్డకు అడ్డంగా నిలబడి ఫొటోలు దిగుతున్నారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా పోకిరీలు వినిపించుకోవడం లేదు. దీంతో కేసులు నమోదు చేయాల్సిన పరిస్థతి నెలకొంది. ఇక, తాజా ఘటనతో కేబుల్ బ్రిడ్డిపై సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తోంది.
Published by:
Sumanth Kanukula
First published:
October 9, 2020, 7:07 AM IST