POLICE ARE SEARCHING FOR THE WIFE WHO MURDERED HER HUSBAND ALONG WITH HER BROTHER FOR THE PROPERTY SSR
Wife: లారీ ఓనర్ భార్య అయి ఉండి ఇవేం పనులు.. ఈ ఆంటీ చూడటానికి ఇలా కనిపిస్తుంది గానీ..
ఉష, భాస్కర్
చెన్నైకి చెందిన భాస్కర్(37) మాజీ వార్డు మెంబర్. ఆయనకు భార్య ఉష, ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు సరుకు రవాణా చేసే లారీలున్నాయి. డబ్బున్న వ్యక్తే కావడంతో ఆర్థికంగా ఏ లోటూ లేకుండా భార్యాపిల్లలను చూసుకుంటూ సుఖంగా గడుపుతున్నాడు.
చెన్నై: కొందరు భార్యాభర్తల బంధానికే మాయని మచ్చ తెస్తున్నారు. కొందరు క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ కట్టుకున్న వాళ్లను కడతేర్చుతుంటే, కొందరు ఆస్తి కోసం అయినవాళ్లను కాటికి సాగనంపుతున్నారు. కట్టుకున్న భర్త అనే కనికరం కూడా చూపడం లేదు. చెన్నైలో ఓ మాజీ వార్డు మెంబర్ హత్య ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఆయనను హత్య చేసింది భార్యే కావడం కొసమెరుపు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన భాస్కర్(37) మాజీ వార్డు మెంబర్. ఆయనకు భార్య ఉష, ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు సరుకు రవాణా చేసే లారీలున్నాయి. డబ్బున్న వ్యక్తే కావడంతో ఆర్థికంగా ఏ లోటూ లేకుండా భార్యాపిల్లలను చూసుకుంటూ సుఖంగా గడుపుతున్నాడు. అయితే.. ఇటీవల భాస్కర్ తల్లి మోహన చెన్నైలోని స్థానిక పోలీస్ స్టేషన్లో తన కుమారుడు, కోడలు, మనవళ్లు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విజువల్ కనిపించింది. అర్ధరాత్రి సమయంలో ఉష ఓ మూటను తీసుకెళ్లి ఇంటి దగ్గర్లో ఉన్న ఓ చెరువులో పడేసినట్లు దృశ్యాల్లో స్పష్టమైంది. పోలీసులు ఆ మూటను విప్పి చూడగా.. లోపల రక్తంతో తడిచిన దిండు, బెడ్‌షీట్ కనిపించాయి. సిక్కరాయపురంలో భాస్కర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని చేతులు, కాళ్లు కట్టివేసి హత్య చేసినట్లు తేల్చారు. పోస్ట్‌మార్టం నిమిత్తం భాస్కర్ మృతదేహాన్ని కిల్పక్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
భాస్కర్‌కు పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయని.. ఆ ఆస్తులను తమ సొంతం చేసుకునేందుకే భార్య ఉష, ఆమె తమ్ముడు బకియరాజ్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మర్డర్ చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసిన సమయంలో భాస్కర్ రక్తం బెడ్‌షీట్, దిండుపై పడటంతో వాటిని మాయం చేసి.. రూమ్ స్ప్రే కొట్టి పిల్లలను తీసుకుని ఉష వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సమయంలో ఉష ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌తో, లారీ తాళాలు, కారు తాళాలను, నగలను తీసుకెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆమె వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఉషను కఠినంగా శిక్షించాలని భాస్కర్ తల్లి డిమాండ్ చేశారు. ఉష ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.