Home /News /crime /

POLICE AND NARCOTIC WINGS ARE ON HIGH ALERT FOR ACCUSED LAXMI PATHI IN THE HYDERABAD DRUGS CASE FULL DETAILS HERE PRV

Hyderabad drugs case: హైదరాబాద్​ డ్రగ్స్​ కేసు.. చిక్కడు దొరకడు.. ఆ వ్యక్తి  కోసం పోలీసుల గాలింపు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇక్కడి యువత గోవాకు వెళుతున్నారు డ్రగ్స్​కోసం. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. డ్రగ్​ వాడే వారు, ప్లెడ్లర్స్​, సరఫరా దారులు మధ్య వర్దులు, ఇలా ప్రతీ ఒక్కరినీ పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

    హైదరాబాద్​లో డ్రగ్స్​ (Hyderabad drugs case) వినియోగం గత కొద్దిరోజులుగా హాట్​టాపిక్​గా మారిపోయాయి. దీనిపై సీఎం కేసీఆర్​ సైతం సీరియస్​ అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్​ భూతాన్ని రూపుమాపడానికి కేసీఆర్ (cm kcr)​ ద్విముఖ వ్యూహం పాటించాలని అధికారులకు కొద్దరోజుల కిందటే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్​ చేపడుతూ డ్రగ్స్​ చైన్​ను సాధ్యమైనంతగా తెగేలా చేస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్​లో పోలీసులు విజయవంతం అయ్యారనే చెప్పొచ్చు. డ్రగ్స్​ వాడకం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడి యువత గోవాకు వెళుతున్నారు డ్రగ్స్​కోసం. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. డ్రగ్​ వాడే వారు, ప్లెడ్లర్స్​, సరఫరా దారులు మధ్య వర్దులు, ఇలా ప్రతీ ఒక్కరినీ పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు (Hyderabad drugs case) సంబంధించి నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Narcotics enforcement wing) దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    హైదరాబాద్​లో డ్రగ్స్ కేసు (Hyderabad drugs case) మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి (laxmi pathi) కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు . ఇందుకోసం మూడు నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ బృందాలు రంగంలోకి దిగాయి.  విశాఖ, తణుకు, గోవా, అరకులలో లక్ష్మీపతి తలదాచుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవడం తరచూ మకాం మారుస్తూ వుండటంతో లక్ష్మీపతి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. గతంలో 2020 నవంబర్ 27న లక్ష్మీపతిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఐటీ వింగ్‌లో భారీ నెట్‌వర్క్ వున్నట్లుగా గుర్తించారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా హ్యాష్ ఆయిల్ విక్రయాలు జరుపుతున్నట్లుగా నిర్ధారించారు.

    సోషల్​ మీడియాలో..

    గత రెండు రోజుల కిందటే హైదరాబాద్‌ (Hyderabad)లో  బీటెక్ విద్యార్థి డ్రగ్స్‌కు బానిసగా మారి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్‌ వింగ్‌ పోలీసులు ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌, శ్రీరామ్‌ అనే డ్రగ్స్‌ అమ్మకందారులను అరెస్ట్‌ చేశారు.  అయితే వీరి వద్ద నుంచి డ్రగ్స్‌ తీసుకొంటున్న దీపక్‌ కుమార్‌ జాదవ్‌, రామకృష్ణ, నిఖిల్‌ జాస్వ, జీవన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రేమ్ ఉపాధ్యాయ్‌ను అరెస్ట్ చేయడంతో అతనికి హాష్ అయిల్ సరఫరా చేస్తున్న లక్ష్మీపతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  సోషల్ మీడియా  ద్వారా డ్రగ్స్‌ (Drugs)కు సంబంధించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు లక్ష్మీపతి సమాచారం ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. బీటెక్ మధ్యలోనే ఆపేసిన లక్ష్మీపతి.. డ్రగ్స్ దందా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసింది.

    పోలీసు అధికారి కొడుకు?

    లక్ష్మీపతి ఓ పోలీసు అధికారి కొడుకుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతనిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అరకులో గంజాయి పెడ్లర్ నగేష్‌ సహాయంతో హాష్‌ ఆయిల్‌ దందా సాగిస్తున్నాడు. మీర్ పేట, బీరంగూడ కు చెందిన మోహన్‌రెడ్డి లక్ష్మీపతి కి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఈ లక్ష్మీపతి దందా సాగిస్తాడని తెలుస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Drugs case, Hyderabad, Hyderabad crime, Tollywood drugs case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు