ఆరేళ్ల బాలికపై అత్యాచారం..ఆ పై హత్య.. దోషికి యావజ్జీవ కారాగార శిక్ష

దేశంలో చిన్నపిల్లు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం ఒకటి సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి యూపీలోని పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

news18
Updated: October 21, 2020, 12:53 PM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం..ఆ పై హత్య.. దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 21, 2020, 12:53 PM IST
  • Share this:
భారత్ లో చిన్న పిల్లలు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. చట్టాల లోని లొసుగుల కారణంగా బయటపడుతున్న నిందితులు ఎంతటివారైనా.. దోషిగా తేలితే వారిని వదిలేది లేదని స్పష్టం చేసింది. కొద్దిరోజుల క్రితం ఆరేళ్ల పాపపై లైంగికదాడికి పాల్పడిన దోషికి జీవిత ఖైదు విధించింది. అంతేగాక అతనిపై రూ .2 లక్షలకు పైగా జరిమానా విధించింది. "పోక్సో చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, నిందితుడికి తది శ్వాస వరకు జీవిత ఖైదు విధించబడుతుంది" అని హపూర్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని అమ్రెహా జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలికను.. వారి ఇంటి పక్కనే ఉంటున్న దల్పత్ అనే వ్యక్తి 2020 ఆగస్టు 6 న కిడ్నాప్ చేశాడు. ఆపై ఆ బాలికను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపాడు. ఆ తర్వాతి రోజు (ఆగస్టు 7 ఉదయం) ఒక పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు.. చివరికి ఏడు రోజుల తర్వాత అతడిని పట్టుకున్నారు. దల్పత్ ను అరెస్టు చేసి.. 22 రోజుల్లోనే ఈ కేసు విచారణను పూర్తి చేశారు పోలీసులు. ఆ పై ఈ కేసు పోక్సో కోర్టుకు తరలించబడింది.
దీంతో కేసును విచారించిన ధర్మాసనం దోషికి జీవిత ఖైదు విధించింది. అంతేగాక రూ. 2 లక్షల జరిమానా కూడా వేసింది. కాగా ఈ వారంలోనే హపూర్ కోర్టు పోక్సో చట్టం కింద శిక్ష విధించడం ఇది రెండోది కావడం గమనార్హం. 2018లో ఇదే జిల్లాలో 12 ఏళ్ల మైనర్ పై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు దోషులకు ఈనెల 15న మరణశిక్ష పడింది. కాగా, అమ్రోహ్ జిల్లా కు చెందిన ఆరేళ్ల పాప కేసులో విచారణ కు సహకరించిన ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు జిల్లా పోలీసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: October 21, 2020, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading