హోమ్ /వార్తలు /క్రైమ్ /

PM Modi Security Breach : ఎంక్వైరీ కమిటీ హెడ్ జస్టిస్ ఇందూ మల్హోత్రాకు బెదిరింపులు.. లాయర్లకు కూడా

PM Modi Security Breach : ఎంక్వైరీ కమిటీ హెడ్ జస్టిస్ ఇందూ మల్హోత్రాకు బెదిరింపులు.. లాయర్లకు కూడా

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనను దర్యాప్తు చేస్తోన్న సుప్రీంకోర్టు కమిటీ హెడ్ మాజీ జడ్జి ఇందూ మల్హోత్రాకు బెదిరింపులు వచ్చాయి. సుప్రీంకోర్టు లాయర్లకు కూడా ఖలిస్తానీ గ్రూప్ పేరుతో హెచ్చరికలు జారీ అయ్యాయి..

యావత్ దేశాన్ని నివ్వెరపాటుకు గురిచేసిన ‘ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం’ ఉదంతంపై ప్రతికూలతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈనెల 3న పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీ కాన్వాయ్ అకస్మాత్తుగా రోడ్డుపై నిలిచిపోవడం, 20 నిమిషాల తర్వాత ప్రధాని వెనుదడాన్ని భద్రతా వైఫల్యంగా పేర్కొంటూ ఘటనపై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించడం తెలిసిందే. సెక్యూరిటీ బ్రీచ్ ఘటనను సమగ్రంగా పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి మాజీ జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వం వహిస్తున్నారు. అలాంటిదిప్పుడు ఎంక్వైరీ హెడ్ ఇందూనే ముష్కరులు టార్గెట్ చేశారు. ప్రధాని భద్రతా వైఫల్యం అంశాన్ని విచారించడానికి వీల్లేదని, కాదు కూడదని ముందుకెళితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుమానిత ఖలిస్తానీ ప్రేరిత సంస్థ బెదిరింపు కాల్స్ చేసింది. జడ్జికేకాదు, సుప్రీంకోర్టు లాయర్లకు సైతం హెచ్చరికలు వచ్చాయి.

ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ), పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డీజీపీ సభ్యులుగా ఉన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాల దర్యాప్తులు పూర్తిగా నిలిచిపోగా, జస్టిస్ ఇందూ కమిటీ ఒక్కటే ప్రస్తుతం కేసును పరిశీలిస్తోంది. కాగా, ప్రధాని భద్రత లోపంపై విచారణ చేయవద్దంటూ జస్టిస్ ఇందూ మల్హోత్రా బెదిరిస్తూ సిక్ ఫర్ జస్టిస్( ఎస్ఎఫ్ జే) సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.

Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికలు వాయిదా -EC కీలక నిర్ణయం -దళితుల సెంటిమెంట్మాజీ జడ్జి ఇందూ మల్హోత్రానే కాదు, ప్రధాని భద్రతా వైఫల్యంపై వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన లాయర్లు నిశాంత్ కట్నేశ్వర్కర్, అపూర్వ్ శుక్లాలకు కూడా ఎస్ఎఫ్‌జే నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదింరింపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈనెల 3న ప్రధాని మోదీ పంజాబ్ లో పర్యటించిన సమయంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తెలిసిందే.

Professional Queuer : ఏ పనీ చేయడు.. కేవలం క్యూలైన్‌లో నిలబడి రోజూ రూ.16 వేలు సంపాదన!పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఫిరోజ్ పూర్ లో బీజేపీ సభకు వెళ్లాల్సిన ప్రధాని.. వాతావరణం బాగోలేక రోడ్డు మార్గంలో హుస్సేనీవాలాలోని పంజాబీ అమరవీరుల స్మారకానికి బయలుదేరగా, ఫిరోజ్ పూర్ సమీపంలో రైతుల నిరసనల కారణంగా రోడ్డుపైనే నిలిచిపోయారు. పాక్ సరిహద్దుకు దగ్గరగా చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది.

First published:

Tags: Pm modi, Punjab, Security

ఉత్తమ కథలు