PLANTED BOMBS BLASTED IN TIRUPATHI POLICE ARRESTED TWO PERSONS NGS
Andhra Pradesh: తిరుపతి ఎస్వీయూనివర్శిటీలో పేలిన నాటు బాంబులు: ఇద్దరి అరెస్ట్: కారణం ఏంటో తెలుసా?
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో నాటు బాంబుల కలకలం
ఎస్వీ యూనివర్శిటీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నాటు బాంబులు పేలడం కలకలం రేపింది. పేలుడుకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకు అక్కడ బాంబులు అమర్చారు? అవి ఎలా పేలాయి?
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో నాటు బాంబులు పేలడం కలకలం రేపింది. ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ శునకం, అడవి పంది మృతి చెందాయి. హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకున్న యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబులుగా వాటిని గుర్తించారు. వాటిని జంతువుల కోసం అక్కడ పెట్టిన వేటగాళ్లు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సాధారణంగా ముగా జీవాల వేటకోసం నాటు బాంబులను అమర్చారు వేటగాళ్లు. శేషాచల అటవీ ప్రాంతంలో ఎన్నో అరుదైన.. వన్య ప్రాణులకూ అభయారణ్యంగా మారింది. సాధు జంతువుల నుంచి క్రూర మృగాలా వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో అక్కడ నివసిస్తున్నాయి. సాధు జంతువులలో ముఖ్యంగా జింకలు., దుప్పులు, కణితులు, అటవీ పందులు ఇతర జంతువులు. .లాక్ డౌన్ సమయం నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం దొరకక., నిశ్శబ్ద వాతారవరం ఉండటంతో కొన్ని పల్లెలు, తిరుపతి శివారు ప్రాంతాలలో సమాచారం అధికమైమయ్యాయి. ఇదే అదునుగా చేసుకున్న వేటగాళ్ల ఉచ్చులో పడి బలవుతున్న పరిస్థితి ఏర్పడింది.
గతంలో వేటగాళ్లు అమర్చిన నాటు బాంబులకు ఆవులు కూడా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దుప్పులు, అటవీ పందుల సమాచారం అధికం కావడంతో వేటగాళ్లు మళ్లీ వేటాడటం ప్రారంభించారు. మొన్న ఎర్రావారిపాళ్యం మండలంలోని శేషచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం సాధారణ తనిఖీలు చేపట్టారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కూంబింగ్ నిర్వహించే సమయంలో తలకోన చెక్ పోస్ట్ దగ్గర గల నిమ్మకాయల బండ వద్ద నెమలి మాసం., ఉచ్చుతో వేటగాళ్లు కనిపించడం గమనించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. వెంటనే వేటగాళ్లను అదుపులోకి తీసుకొనే క్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని గుర్తించిన మరో ఇద్దరు వేటగాళ్లు పారిపోగా...నౌకద్ అనే వేటగాణ్ణి అదుపులోకి తీసుకున్నారు. వేటగాడి దగ్గర నుంచి జాతీయ పక్షి నెమలి మాంసం., ఉచ్చును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
తాజాగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నాటుబాంబులు పేలడం కలకలం రేపుతోంది. ఆహార కోసం వచ్చిన.. అడివి పంది నాటు బాంబుపై కాలు మోపడంతో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. పేలిన వెను వెంటనే అటవీ పంది, కుక్క మృతి చెందాయి. బాంబు పేలిన సమయంలో తీవ్ర శబ్దం రావడంతో అక్కడకి చేరుకున్న పోలీస్ అధికారులు బాంబ్ స్క్వాడ్ కు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలంలో సోదాలు చేసిన బాంబ్ స్క్వాడ్ జంతువుల వేటకు వినియోగించే.. సాధారణ నాటు బాంబు అంటూ తేల్చింది. నాటు బాంబు అమర్చిన ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు అలిపిరి పోలీస్ అధికారులు.
కారణం ఏదైనా విద్యార్థులు భారీగా ఉండే క్యాంపస్ లో ఇలాంటి పేలుళ్లతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.