Home /News /crime /

PLANE CRASHED ON A MAJOR ROAD IN HAITI CAPITAL KILLING AT LEAST SEVEN PEOPLE PVN

Plane Crash : రోడ్డుపై విమానం క్రాష్..ఏడుగురు మృతి

రోడ్డుపై ట్రక్కుని ఢీకొట్టిన విమానం

రోడ్డుపై ట్రక్కుని ఢీకొట్టిన విమానం

Plane Crash : హైతీ దేశంలో ఘోరం జరిగింది. గాల్లో వెళ్లే విమానం సడెన్ గా రోడ్డుపై సోడా బాటిల్స్ లోడుతో వెళ్తున్న ట్రక్కుని ఢీ కొట్టి క్రాష్ అయ్యింది. హైతీ రాజధాని ని పోర్ట్ అవ్​ ప్రిన్స్​ లో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Plane Crash : హైతీ దేశంలో ఘోరం జరిగింది. గాల్లో వెళ్లే విమానం సడెన్ గా రోడ్డుపై సోడా బాటిల్స్ లోడుతో వెళ్తున్న ట్రక్కుని ఢీ కొట్టి క్రాష్ అయ్యింది. హైతీ రాజధాని ని పోర్ట్ అవ్​ ప్రిన్స్​ లో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్లు,మరికొందరు తీవ్రంగా సమాచారం.

ప్రైవేట్ యాజమాన్యంలోని సెస్నా 207 అనే చిన్న సైజు విమానం జాక్మెల్ ఓడరేవు నగరానికి వెళుతుండగా సాయంత్రం 4 గంటలకు కూలిపోయింది. ఈ విమానం.. మాజీ హైతీ సెనేటర్ అయిన రిచర్డ్ హెర్వే ఫోర్‌కాండ్‌ కు చెందినది. కిడ్నాప్​లు, ముఠా తగాదాలు పెరుగుతున్న క్రమంలో పోర్ట్​ అవ్​ ప్రిన్స్​ నుంచి చిన్నసైజు విమానాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లడం హైతిలో సాధారణంగా మారింది. ప్రత్యేకించి మార్టిసాంట్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది. రిచర్డ్ హెర్వే ఫోర్‌కాండ్‌ కూడా ఇప్పుడు కూలిపోయిన విమానంలోనే తరచూ జాక్మెల్ కి ప్రయాణిస్తుండేవారు.

ALSO READ Shocking : బీజేపీ నేత దారుణ హత్య..ఇంటి ముందే నాలుగు రౌండ్ల కాల్పులు

బుధవారం సాయంత్రం కోస్టల్ సిటీకి వెళ్లే క్రమంలో ఓ చోట ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని, తీవ్రగాయాలపాలైన పైలట్​ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు. విమానం సీటింగ్ కెపాసిటీ ఐదు మాత్రమేనని చెప్పారు. అయితే ఈ ఘటనపై హైతి ప్రధాని ఏరియల్ హెన్రీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిశాక హృదయం బరువెక్కిందని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. బాధితుల కుటంబాలకు సంతాపం తెలిపారు. కాగా, 9 నెలల క్రితం జాక్మెల్ వెళ్తున్న ఓ విమానం కూడా పోర్ట్ అవ్​ ప్రిన్స్​లోనే ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ఆరుగురు మరణించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Haiti, Plane Crash

తదుపరి వార్తలు