హోమ్ /వార్తలు /క్రైమ్ /

Plane crash : గాల్లో వెళ్లాల్సిన విమానం..రోడ్డు మీదకొచ్చి లారీని ఢీకొట్టింది

Plane crash : గాల్లో వెళ్లాల్సిన విమానం..రోడ్డు మీదకొచ్చి లారీని ఢీకొట్టింది

 Plane crashes into lorry :   విమానం లారీ ట్రక్కును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం

Plane crashes into lorry :  అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో హైవేపై విమానం కుప్పకూలింది. షార్లెట్‌ కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో డేవిడ్‌ సన్ కౌంటీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న I-85 సౌత్‌ లో డ్యూయల్ ఇంజిన్ బీచ్‌ క్రాఫ్ట్ బారన్ విమానం..రోడ్డుపై వెళ్లే భారీ ట్రక్కును ఢీకొట్టింది. విమానం ఢీకొట్టడంతో ట్రక్కు బోల్తా పడి రోడ్డుపైకి దూసుకెళ్లిందని హైవే పెట్రోలింగ్ తెలిపింది. విమానం లారీ ట్రక్కును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడిక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ ను విన్ స్టన్ సేలం హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరణించిన పైలట్ ను షార్లెట్‌ కు చెందిన రేమండ్ జాన్ అక్లీ (43)గా గుర్తించారు. విమానం క్రాష్‌కు గల కారణాలేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు.

ALSO READ Rocket: మార్చి 4న చంద్రుడిని తాకనున్న చైనా రాకెట్.. ఫాల్కన్ 9 కంటే ముందుగానే..

అయితే ఎయిర్ పోర్టు రన్ వే నుంచి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తు్న్నారు. విమానం టేకాఫ్ తీసుకోవడం సమస్యలను ఎదుర్కొన్నట్టు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే FAA దర్యాప్తు ప్రారంభించింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB)తో కలిసి దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలంలోని ఫుటేజీ ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది.

First published:

Tags: Plane Crash, USA

ఉత్తమ కథలు