సెక్స్ చేయాలని టీనేజర్‌‌కు అసభ్య మెసేజ్‌లు.. ప్రముఖ ఆటగాడు అరెస్టు..

పిట్స్‌బర్గ్ పైరేట్స్ బేస్‌బాల్ ఆటగాడు ఫిలిప్ వాజ్‌క్వెజ్(28).. ఓ టీనేజర్(15)కు రెండేళ్లుగా అసభ్యకర సందేశాలు, ఫోటోలు పంపుతూ ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచే తనతో సెక్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు.

news18-telugu
Updated: September 18, 2019, 2:37 PM IST
సెక్స్ చేయాలని టీనేజర్‌‌కు అసభ్య మెసేజ్‌లు.. ప్రముఖ ఆటగాడు అరెస్టు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడో ప్రముఖ ఆటగాడు.. ఆటలో తనదైన శైలి.. అలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ, అత్యంత నీచంగా ప్రవర్తించి అపవాదు మూటగట్టుకుంటున్నాడు. ఓ టీనేజర్‌ను వేధింపులకు గురి చేస్తూ, తనతో సెక్స్ చేయాలంటూ బలవంతపెట్టాడు. అంతేకాదు.. ఆమెకు అసభ్యకర సందేశాలు, ఫోటోలు పంపుతూ వేధించాడు. దీంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకెళితే.. పిట్స్‌బర్గ్ పైరేట్స్ బేస్‌బాల్ ఆటగాడు ఫిలిప్ వాజ్‌క్వెజ్(28).. ఓ టీనేజర్(15)కు రెండేళ్లుగా అసభ్యకర సందేశాలు, ఫోటోలు పంపుతూ ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచే తనతో సెక్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. తాజాగా ఓ పోర్న్ వీడియోను కూడా ఆమెకు షేర్ చేశాడు. దీంతో అతడి చర్యలకు విసిగి వేసారిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. గత నెలలో విచారణ చేపట్టిన పోలీసులు ఫిలిప్ నేరం చేశాడని నిర్ధారించారు.
పిట్స్‌బర్గ్ పైరేట్స్ బేస్‌బాల్ ఆటగాడు ఫిలిప్ వాజ్‌క్వెజ్(28) (Photo:Justin Berl / Getty Images)

మంగళవారం అతడ్ని అదుపులోకి తీసుకొని, పిల్లలపై వేధింపులు, మైనర్లకు అభ్యంతరకర సమాచారం అందజేసిన కేసుల్లో బుక్ చేశారు. అతడి ఇంటిని సోదా చేసి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో ఫిలిప్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో అతడికి పెద్ద శిక్షే పడే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 18, 2019, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading