మద్యం మత్తులో విమానం నడిపేందుకు పైలట్ యత్నం...చివరకు ఏం జరిగిందంటే...?

అదనపు కాక్ పిక్ సభ్యుడు అయినప్పటికీ డీజీసీఏ నిబంధనల ప్రకారం బ్రీత్ ఎనలైజర్ పరీక్ష తప్పనిసరి, అయితే ఈ పరీక్షలో సదరు పైలట్ ఫెయిల్ కావడంతో ఆయనను కాక్ పిట్ లోకి అనుమతించలేదు. అలాగే శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.

news18-telugu
Updated: July 15, 2019, 5:03 PM IST
మద్యం మత్తులో విమానం నడిపేందుకు పైలట్ యత్నం...చివరకు ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 15, 2019, 5:03 PM IST
సాధారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా మందుబాబులను గుర్తించి వారి ఆటకట్టించడం పరిపాటే. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో విమానం నడిపేందుకు సిద్ధమవుతున్న ఓ సీనియర్ పైలట్ బ్రీత్ ఎనలైజర్ ద్వారా డ్రంకెన్ టెస్టులో పట్టుబడటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఎయిర్ ఇండియాకు చెందిన సదరు పైలట్ న్యూ ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో సాధారణ ప్రయాణికుడిలాగే ప్రయాణించేందుకు విమానం ఎక్కాడు. అయితే సీట్లు ఖాళీగా లేకపోవడంతో కాక్ పిట్ లో పైలెట్లతో కలిసి అదనపు మెంబర్ గా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే అదనపు కాక్ పిక్ సభ్యుడు అయినప్పటికీ డీజీసీఏ నిబంధనల ప్రకారం బ్రీత్ ఎనలైజర్ పరీక్ష తప్పనిసరి, అయితే ఈ పరీక్షలో సదరు పైలట్ ఫెయిల్ కావడంతో ఆయనను కాక్ పిట్ లోకి అనుమతించలేదు. అలాగే శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.

అయితే నిబంధనలు తెలిసి కూడా సీనియర్ ఉద్యోగి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఈ విధంగా మద్యం మత్తులో కాక్ పిట్ లోకి ప్రవేశించాలని చూడటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రయాణికులు భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్న కారణంతోనే సదరు పైలట్ ను సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...